S Jaishankar: ‘‘రాహుల్ గాంధీవి ఉద్దేశపూర్వక అబద్ధాలు’’.. “ట్రంప్ ప్రమాణస్వీకారం” వ్యాఖ్యలపై జైశంకర్ రిప్లై..
- డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఆరోపణలు..
- ఉద్దేశపూర్వకంగా అబద్దాలు చెబుతున్నారని జైశంకర్ రిఫ్లై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు, జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారం సభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది.
Read Also: Bathua Leaves Benefits: ఈ ఆకు గురించి మీకు తెలుసా..? ఎంత మేలు చేస్తుందో తెలిస్తే వదిలిపెట్టరు
Also Read
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ‘‘ డిసెంబర్ 2024లో నా అమెరికా పర్యటన గురించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పారు. నేను బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యొక్క విదేశాంగ కార్యదర్శి, NSAని కలవడానికి వెళ్ళాను. మా కాన్సుల్స్ జనరల్ సమావేశానికి కూడా అధ్యక్షత వహించడానికి వెళ్ళాను. ట్రంప్ హయాంలో కాబోయే ఎన్ఎస్ఏగా నియమితులయ్యే అధికారి నన్ను కలిశారు. ఏ దశలోనూ ప్రధానమంత్రి ఆహ్వానం గురించి చర్చించలేదు. మన ప్రధాని ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకారని అందరికీ తెలుసు. నిజానికి భారత్ దేశం సాధారణంగా ప్రత్యేక రాయబారులచే ప్రాతినిధ్యం వహిస్తుంది. రాహుల్ గాంధీ అబద్ధాలు రాజకీయంగా ఉద్దేశించిబడి ఉండొచ్చు. కానీ అవి విదేశాల్లో దేశాన్ని దెబ్బతీస్తాయి.’’ అని అన్నారు.
అంతకుముందు లోక్‌సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానం పొందడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ని అమెరికాకు పంపాల్సి అసవరం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ, ఆర్థిక విధానాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. “మేము అమెరికాతో మాట్లాడినప్పుడు, మా ప్రధానమంత్రి ఆహ్వానం కోసం విదేశాంగ మంత్రిని మూడు-నాలుగు సార్లు పంపము ఎందుకంటే మాకు పొడక్షన్ సిస్టమ్ ఉండి, మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాలపై పని చేస్తుంటే, అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
EAM Dr S Jaishankar tweets, "Leader of Opposition Rahul Gandhi deliberately spoke a falsehood about my visit to the US in December 2024. I went to meet the Secretary of State and NSA of the Biden Administration. Also to chair a gathering of our Consuls General. During my stay,… pic.twitter.com/LIOfuQUd0u
— ANI (@ANI) February 3, 2025
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!