Kishan Reddy: నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.. అందులో, తెలుగులో ఒక సామెత ఉంది- పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట.. అచ్చం అలాగే, రాహుల్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు ఈ సామెతకు సరిపోతుందన తెలిపారు. ఇక, రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి, వాటిని ఎన్డీయే సర్కారుకి ఆపాదించడం అతని అవివేకానికి నిదర్శనం అన్నారు. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ కోసం కొన్ని వాస్తవాలను ఇక్కడ తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: PM Modi: ‘‘నెహ్రూ టైంలో పావు వంతు, ఇందిరా టైంలో రూ. 10 లక్షల టాక్స్’’..
* కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో ఉపాధి అవకాశాలు 6 శాతం పెరిగితే, బీజేపీ పాలనలో 36 శాతం పెరిగాయి..
* ఆర్బీఐ నివేదిక ప్రకారం యూపీఏ 10 సంవత్సరాల పాలనలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టిస్తే.. ఒక్క 2024 సంవత్సరంలోనే 4.9 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు.
* 2014 నుంచి 2024 వరకు మొత్తం 10 ఏళ్లలో నరేంద్ర మోడీ పాలనలో 17.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* వ్యవసాయ రంగంలో ఉపాధి కాంగ్రెస్ హయాంలో 16 శాతం తగ్గితే, మోడీ హయాంలో 19 శాతం పెరిగింది.
* సర్వీస్ సెక్టార్ లో ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ హయాంలో 25 శాతం పెరిగితే, బీజేపీ హయాంలో 36 శాతం పెరిగింది.
* 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిపోయింది.
* అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉపాధి పొందుతున్నవారు 2013లో 33.95 శాతం ఉండగా, 2024లో అది 54.81 శాతానికి పెరిగింది.
* గ్రామీణ మహిళలలో సొంత బ్యాంకు ఖాతా కలిగిన కార్మికులు/పారిశ్రామికవేత్తలు 2017-18లో 19 శాతం ఉండగా.. 2023-24 నాటికి ఇది 31.2 శాతానికి పెరిగింది. దీంతో, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆదాయాన్ని ఆర్జించే మహిళా కార్మికులు/ పారిశ్రామికవేత్తల వైపు మారుతున్న దృక్పథాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ గణాంకాలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన నివేదికలో స్పష్టంగా తెలియజేసినవే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తెలుగులో ఒక సామెత ఉంది – "పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట"; నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అచ్చం ఈ సామెతకు సరిపోతాయి.
రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి,…
— G Kishan Reddy (@kishanreddybjp) February 3, 2025