Kishan Reddy: మోడీ హయాంలో ఉపాధి వృద్ధి.. రాహుల్ గాంధీకి గుణపాఠం
- రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి.
- మోడీ హయాంలో ఉపాధి వృద్ధిపై గణాంకాలు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కోసం కొన్ని వాస్తవాలను తెలుపుతున్నాని కొన్ని విషయాలను తెలిపాడు.
* కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో ఉపాధి అవకాశాలు 6% పెరిగితే, బీజేపీ పాలనలో 36% పెరిగాయి.
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
* RBI నివేదిక ప్రకారం UPA 10 సంవత్సరాల పాలనలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే, ఒక్క 2024 సంవత్సరంలోనే 4.9 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* 2014 నుంచి 2024 వరకు మొత్తం 10 సంవత్సరాల మోదీ పాలనలో 17.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* వ్యవసాయ రంగంలో ఉపాధి కాంగ్రెస్ హయాంలో 16% తగ్గితే, మోదీ హయాంలో 19% పెరిగింది.
* సర్వీస్ సెక్టార్ లో ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ హయాంలో 25% పెరిగితే, మోదీ హయాంలో 36% పెరిగాయి.
* 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిపోయింది.
* అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉపాధి పొందుతున్నవారు 2013 లో 33.95 శాతం ఉండగా, 2024 లో అది 54.81 శాతానికి పెరిగింది.
* గ్రామీణ మహిళలలో సొంత బ్యాంకు ఖాతా కలిగిన కార్మికులు/పారిశ్రామికవేత్తలు 2017-18 లో 19 శాతం ఉండగా, 2023-24 నాటికి ఇది 31.2 శాతానికి పెరిగింది. ఇది స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆదాయాన్ని ఆర్జించే మహిళా కార్మికులు/ పారిశ్రామికవేత్తల వైపు మారుతున్న దృక్పథాన్ని తెలియజేస్తుంది.
ఈ విషయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
తెలుగులో ఒక సామెత ఉంది – "పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట"; నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అచ్చం ఈ సామెతకు సరిపోతాయి.
రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి,…
— G Kishan Reddy (@kishanreddybjp) February 3, 2025
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!