నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి ఇటీవల సమన్లు జారీ చేసింది ఈడీ… విచారణకు హాజరుకావాలని కోరింది. జూన్ 13న ఈడీ ముందు రాహుల్ హాజరుకానుండగా.. 23వ తేదీన సోనియా గాంధీ ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది..
Read Also: Astrology: జూన్ 13 సోమవారం దినఫలాలు
ఇక, ఇవాళ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అగ్రనాయకులు, పార్లమెంట్ సభ్యులు, సీడబ్ల్యూసీ మెంబర్లు మద్దతు తెలుపుతూ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తమ నేతకు మద్దతుగా జరగనున్న ర్యాలీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో పాటు పవన్ బన్సాల్‌ను ఈడీ ప్రశ్నించింది. 2013లో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వేసిన పిటిషన్ ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే.