తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది. వరస చేరికలతో హుషారుగా కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే ప్రజా సమస్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో వరసగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల వరంగల్ సభకు రాహుల్ గాంధీ రావడం, రైతు డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. దీంతో పాటు గతంలో కాంగ్రెస్…
రామాయణంలో రాముడికి హన్మంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. తనకు సోనియా గాంధీ గొప్ప అవకాశం ఇచ్చారని.. ప్రధాని, సీఎం పదవుల కంటే పీసీసీ పదవి చాలా గొప్పదని చెప్పారు. జీవితాంతం తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు విశ్వాసపాత్రుడిగా పని చేస్తానని తెలిపారు. గురువారం పార్టీలో చేరినవారిని ఘనస్వాగతం పలికిన రేవంత్.. ఈ సందర్భంగా…
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుందని.. పార్టీ సర్వేలో అదే తేలిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ను ఢీకొట్టే పరిస్థితి బీజేపీకి ఏమాత్రం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో మంత్రులుగా చేసిన కొందరు కోట్లు సంపాదించారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్లు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు తాము బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పార్టీ బలమే కార్యకర్తలని వెల్లడించారు.…
మరోమారు రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నారు. కేటీఆర్ ఇలాకా టార్గెట్ గా ఎంచుకున్నారు రాహుల్. కాగా.. సెప్టెంబర్ లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ రానున్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లకు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. కాగా.. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్ను విడుదల చేయనున్నారు. ఇది ఇలావుండగా.. మరోవైపు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు…
In a jolt to TRS in Badangpet Corporation, Mayor Parijatha Narsimha Reddy, corporators Peddbavi Sudarshan Reddy, Rallaguda Srinivasareddy and some other corporators joined Congress on monday.
రాజకీయంగా పోటీని తట్టుకోలేని వారు పార్టీ నుంచి వెళ్లిపోవడం సహజమేనని దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు… అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి వారు పార్టీ నుంచి వెళ్లి పోయినందువల్ల ఎటువంటి నష్టం లేదని అన్నారు. అదే విధంగాతన నియోజకవర్గానికి చెందిన కరకగూడెం…
కేరళలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం అల్లర్లకు కారణం అయ్యారు. ఏకంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయాన్ని శుక్రవారం ధ్వసం చేశారు. కేరళలోని కొండ ప్రాంతాల్లోని అడవుల చుట్టూ బఫర్ జోన్ల వల్ల కలిగే ఇబ్బందులపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ తీవ్ర ఆందోళనలకు తెరతీసింది వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ. ఆందోళనల్లో భాగంగా వయనాడ్ లోని రాహుల్ గాంధీ ఆఫీస్ పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. దాడికి…