France and USA praised Prime Minister Modi's comments: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడితో అన్న వ్యాఖ్యలకు మద్దతు పెరుగుతోంది. తాజాగా యూఎస్ఏ, ఫ్రాన్స్ దేశాలు కూడా మోదీ వ్యాఖ్యలు సరైనవని తెలిపాయి. న్యూయార్క్ లో జరుగుతన్న 77వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మద్దతు తెలిపారు. యుద్ధానికి ఇది సమయం కాదని ప్రధాని మోదీ…
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులు దురాగతాలు ఒక్కొక్కటిగ బయటపడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ నుంచి రష్యా బలగాలు నిష్క్రమించాయి. ఈ ప్రాంతాన్ని మళ్లీ ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తిరిగి ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లో రష్యా బలగాలు చేసిన అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజియమ్ ప్రాంతంలో 400లకు పైగా మృతదేహాలను ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. దీంట్లో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Visa-Free Travel To Russia: రష్యాను సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై రష్యా సందర్శించాలనుకుంటే వీసా రహితంగా సందర్శించే అవకాశం ఏర్పడింది. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మధ్య ఇరు దేశాల మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ ప్రయాణ ఒప్పందం చర్చలోకి వచ్చింది. ఈ ఒప్పందంపై త్వరలోనే నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Russia's defence minister, Sergei Shoigu, said Sunday that Moscow's forces have taken the strategic Ukrainian city of Lysychansk and now control the entire region of Lugansk, which has been the target of fierce battles in recent weeks.
ఉక్రెయిన్ పై భీకరదాడిని కొనసాగిస్తోంది రష్యా. యుద్ధం ప్రారంభం అయి నాలుగు నెలలు గడిచినా.. రష్యా తన దాడిని ఆపడం లేదు. ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణాలు, నగరాలు మసిదిబ్బను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా దాడులను ఎక్కువ చేసింది. క్రమంగా ఉక్రెయిన్ తూర్పు భాగం రష్యా చేతుల్లోకి వెళ్లిపోతోంది. తాజాగా శుక్రవారం రాత్రి సమయంలో రష్యా జరిపిన క్షిపణి దాడిలో 21 మంది మరణించారు. బ్లాక్ సీ ఒడెస్సా పోర్టుకు దక్షిణంగా 80…
స్వీడన్, ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరబోతున్నాయి. అందుకు ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే ఈ విషయంపై మొదటి నుంచి రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో రష్యా ఈ విషయమై స్వీడన్, ఫిన్లాండ్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ రెండు దేశాలు నాటో కూటమిలో చేరడంపై రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తర్కమెనిస్థాన్ రాజధాని అష్గాబాత్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్ మాదిరిగా రష్యాకు స్వీడన్, ఫిన్లాండ్ తో…
మూడు నెలలు గుడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి రావడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతం అయిన డాన్ బోస్ ప్రాంతంలో రష్యా తన దాడిని పెంచింది. ఇప్పటికే రాజధాని కీవ్ తో సహా, ఖార్కివ్, సుమీ, మరియోపోల్ వంటి నగరాలను ధ్వంసం చేసింది రష్యన్ ఆర్మీ. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లోని 20 శాతం భూమి ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్…
రష్యా, ఉక్రెయిన్ మధ్య యద్దం మొదలై మూడు నెలుల దాటింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన నగరాలు, పట్టణాలు ధ్వంసం అవుతున్నాయి. తాజాగా లక్సెంబర్గ్ చట్ట సభలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రసంగించారు. తన దేశంలో ఐదో వంతు భూభాగాన్ని రష్యా నియంత్రిస్తోందని జెలన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాలో విలీనం అయిన క్రిమియా ద్వీపకల్పంతో పాటు రష్యాకు మద్దుతుగా నిలుస్తున్న వేర్పాటువాదుల ఆధీనంలో…
ప్రపంచ అగ్రనేత, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇంకో మూడేళ్లే బతుకుతాడా..? ఇంటెలిజెన్స్ అధికారులు, గూడాచారులు రిపోర్ట్ ఆధారంగా మూడేళ్లకు మించి పుతిన్ బతకరని తెలుస్తోంది. తాజాగా పుతిన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ‘ది ఇండిపెండెంట్’ ఒక నివేదికలో తెలియజేసింది. అతను మూడేళ్లు మించి జీవించి ఉండరని మాజీ రష్యా ఇంటెలిజెన్స్ అధికారి చెప్పినట్లు ఇండిపెండెంట్ ఒక కథనంలో తెలిపింది. పుతిన్ తీవ్రమైన కాన్సర్ తో బాధపడుతున్నట్లు దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడిచింది. రష్యన్ ఫెడరల్…
రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకుందామని అనుకున్న రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడింది ఉక్రెయిన్. కీవ్ ను స్వాధీనం చేసుకోవడం కుదరకపోవడంతో రష్యా, ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి మళ్లీ యుద్ధాన్ని మొదలు పెట్టింది. డాన్ బాస్, లుగాన్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే…