రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అన్ని దేశాలను టెన్షన్ పెడుతున్నాయి.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా.. ఆ దేశ రాజధాని వైపు దూసుకెళ్తుండగా.. మరోవైపు ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యా తగిన మూల్యం చెల్లించకతప్పదని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది.. ఇక, ఉక్రెయిన్ నుంచి కొంత మంది భారతీయులను తరలించినా.. ఇంకా చాలా మంది ఉక్రెయిన్‌లో ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయ పౌరుల భద్రత, క్షేమం కోసం…
ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. రష్యా అనుకూల వేర్పాటువాదులు ప్రాబల్యం అధికంగా ఉన్న రెండు ప్రాంతాలను రష్యా స్వతంత్ర దేశాలుగా ప్రకటించింది. అందేకాదు, ఆ రెండు దేశాల్లో శాంతి పరిరక్షణ కోసం రష్యా తన సైన్యాన్ని పంపేందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. రష్యా సైనిక డిక్లరేషన్‌పై పుతిన్ సంతకం చేశారు. అటు రష్యన్ పార్లమెంట్ సైతం దీనిని ఆమోదించడంతో సైనిక బలగాలు ఉక్రెయిన్ గడ్డపై అడుగుపెట్టబోతున్నాయి. దీంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అయ్యాయి. ఉక్రెయిన్‌లోని రెండు…
ఉక్రెయిన్‌పై ఏ క్షణాన్నైనా యుద్దానికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది . ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే…
ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించగా, ఉక్రెయిన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు మోహరించాయి. ఉక్రెయిన్ ను అక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, రష్యాకూడా ఇదే విధంగా చెబున్నది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు విరుద్దంగా నాటో దేశాలు, అమెరికా ప్రవర్తిస్తే తగిన చర్యలు…
బీజింగ్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ప్రారంభం సమయంలో క్రీడాకారులు పరేడ్ ను నిర్వహించారు. అయితే, పరేడ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారులు జాతీయ పతాకం పట్టుకొని మార్చ్ చేసే సమయంలో సడెన్ గా రష్యా అధ్యక్షుడు కునుకు తీశారు. ఆ తరువాత లేచి థంప్ చూపించారు. ఈ మెగా ఈవెంట్లో రష్యా క్రీడాకారులు పాల్గొనలేదు. డోపింగ్ ఆరోపణలతో రష్యా క్రీడాకారులు మెగా ఈవెంట్లలో పాల్గొనడం లేదు.…
ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశాల్లో రష్యాకూడా ఒకటి. కావాల్సినంత స్థలం ఉన్నది. వనరులు ఉన్నాయి. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ రష్యా ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో నెలకొన్నది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత రష్యాలో జనాభ క్రమంగా తగ్గిపోతూ వస్తున్నది. 1990 తరువాత జనాభా మరింత తగ్గిపోవడం ప్రారంభమైంది. అయితే, కరోనా కారణంగా ఆ దేశంలో మరణాల సంఖ్య భారీగా నమోదైంది. 2020లో రష్యా జనాభా 5 లక్షల వరకు తగ్గిపోగా, 2021 నుంచి ఇప్పటివరకు…
ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. వివిధ అంశాలపై ఇరువురు నేతలను చర్చించారు. డిసెంబర్ 6 వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. వాణిజ్యపరమైన ఒప్పందాలతో పాటుగా, రక్షణ ఒప్పందాలు రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. Read: డిసెంబర్ 21, మంగళవారం దినఫలాలు… ఇటీవలే రష్యా నుంచి ఇండియా ఎస్ 400…
అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా కన్నేసింది. ఆ దేశ సరిహద్దులో 75 వేల సైనిక బలగాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో ఆప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది. Read: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్ రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికాతో పాటుగా జీ7…
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల వెంట రష్యా భారీ ఎత్తున సైనికులను, యుద్ద ట్యాంకులను మొహరించింది. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించుకోవాలని చూస్తోందనే వదంతులు వ్యాపించడంతో అమెరికా ఉలిక్కిపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియోకాల్‌లో మాట్లాడారు. దాదాపు రెండున్న గంటలసేపు వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పలకరింపులతో మొదలైన వీడియో కాల్ క్రమంగా ఉక్రెయిన్ పై చర్చవైపు మళ్లింది. Read: హ్యుందాయ్ భారీ…