రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా నాలుగో నెలకు చేరింది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్ నిలబడుతోంది. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి అమెరికా, నాటో దేశాలు ఆర్థికంగా, సైనికంగా సహాయపడుతున్నాయి. రష్యాను ధీటుగా ఎదుర్కొనేందు స్ట్రింగర్ మిసైళ్లు, ఇతర ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు సైనిక వ్యూహాలను అందిస్తున్నాయి అమెరికా, నాటో దేశాలు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు 40 బిలియన్…
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. నగరాలు, పట్టణాలు, గ్రామాలు.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో విధ్వంసం అయ్యాయి.. మరోవైపు.. ఉక్రెయిన్ నుంచి కూడా ప్రతిఘటన తప్పడం లేదు.. ఇదే సమయంలో.. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.. ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, దైపాక్షి.. ఇలా అన్ని రకాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక, ఇప్పటికే ఆర్థిక పరమైన అంశాలపై నియంత్రణలు విధించిన కెనడా.. తాజాగా ఆ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై నిషేధం విధించింది.. పుతిన్…
ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ప్రారంభమై రెండు నెలలు దాటింది. అయినా ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. బలమైన సైన్యం కలిగిన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా భావించినప్పటికీ… అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న ఆయుధ, సైనిక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రష్యన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బెలారస్, టర్కీ వేదికగా ఇరుదేశాలు పలుమార్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతలు తగ్గడం…
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆక్రమణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యలో భాగంగా రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. 1945లో ఆ రోజున నాజీలను రష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్లో సాధించిన సైనిక…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ బలగాల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా.. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతోంది రష్యా సైన్యం.. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య పలు దపాలుగా జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు.. ఈ నెలలోనే రెండు దేశాల్లో పర్యటించబోతున్నారు. Read Also: Summer Holidays: ఏపీ…
ఉక్రెయిన్పై రష్యా దాడులను చూస్తే.. వారం పది రోజుల్లో ఉక్రెయిన్ మొత్తం రష్యా ఆధీనంలోకి వస్తుందనే అంచనాలు మొదట్లో కనబడ్డాయి.. కానీ, ఉహించని రీతిలో ఉక్రెయిన్ నుంచి ఎదురుదాడి జరుగుతూనే ఉంది.. అయితే, రష్యా వైఫల్యాలకు సొంత నిఘా వ్యవస్థల్లోని గూఢచారులే కారణమని అనుమానిస్తున్నారు పుతిన్. అందుకే దాడికి ముందే రష్యా ప్లాన్ల బ్లూప్రింట్లు అమెరికా, యూకేలకు చేరాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంతో సన్నిహతులు అని కూడా చూడకుండా నిఘా విభాగం అధికారులపై కఠిన చర్యలు…
అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు ఎదురైనా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది.. ఇరు దేశాల మధ్య యుద్ధం 48వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్లో పలు ప్రాంతాలపై ఇంకా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా తన దాడులను కీవ్ నుంచి తూర్పు ఉక్రెయిన్ వైపు కేంద్రీకృతం చేసింది. పోర్టు సిటీ మరియుపోల్ పై నియంత్రణ సాధించే లక్ష్యంతో రష్యన్ దళాలు ముందుకు సాగుతున్నాయి. కాగా వారిని అడ్డుకునేందుకు, తమ భూభాగాన్ని…
ఉక్రెయిన్- రష్యా యుద్ధం సరికొత్త ప్రపంచ మార్పులకు దారితీస్తోంది. అమెరికా, రష్యా మధ్య పాత పగలు ఈ సంక్షోభంతో మరోసారి బయటపడ్డాయి. ప్రస్తుత పరిస్థితి ప్రచ్ఛన్న యుద్ధ రోజులను తలపిస్తోంది. ఈ క్రమంలో అమెరికా, రష్యా అతి పెద్ద దేశాలైన చైనా, భారత్ను పూర్తిగా తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడికి వ్యతిరేకంగా మార్చి 2న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.…
ఐక్యరాజ్యసమితి వద్దన్నా ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో రష్యాపై చర్యలకు దిగింది ఐక్యరాజ్యసమితి. రష్యాకు గురువారం మరో గట్టి షాక్ తగిలింది. ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలి (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నుంచి రష్యాను బహిష్కరించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగింది. జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్ లో సభ్య దేశాల ఓటింగ్ మెజారిటీకి అనుగుణంగా రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బయటకు పంపారు.…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణాల లెక్కలు ఊహకు అందడం లేదు. అంతేలేకుండా సాగుతున్న ఈ సమరంలో, ఇప్పటి వరకు దాదాపు 10వేలమంది రష్యన్ సైనికులు చనిపోయారని తాజాగా వెల్లడించింది రష్యన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ కొమ్సో. అయితే ఏమైందో ఏమోగాని వెంటనే ఆ కథనాన్ని తొలగించింది. అయితే, అప్పటికే ఆ వివరాలు ప్రపంచమంతా పాకిపోయాయి. రష్యా రక్షణ శాఖ గణాంకాలను కోట్ చేస్తూ, కొమ్సో మీడియా చెప్పిన దాని ప్రకారం, 9,861 మంది రష్యన్ సైనికులు చనిపోయారు.…