Russia-Ukraine War: ఉక్రెయిన్ పై యుద్ధ తంత్రాన్ని మార్చింది రష్యా. ఇంతకాలం నాటో దేశాల సహాయంలో ఉక్రెయిన్ దాడులు చేస్తూ రష్యాను ఆత్మరక్షణలో పడేసింది. దీంతో మాస్కో తన వార్ ప్లాన్ ను అమలు చేస్తోంది. చలికాలం నేపథ్యంలో ఉక్రెయిన్ ను దెబ్బతీసేలా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ ‘‘కామికేజ్’’ డ్రోన్ల సహాయంతో ప్రధాన నగరాలపై భీకరదాడులు చేస్తోంది. రాజధాని కీవ్ తో సహా, జపొరిజ్జియా, దినిప్రో, జటోమిర్ నగరాల్లోని విద్యుత్…
Russian attacks on Ukraine targeting power grid: విద్యుత్ వ్యవస్థే లక్ష్యంగా రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. శీతాకాలం రావడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించి దేశం నుంచి వలసలు పెంచాలనే ఆలోచనలతోనే రష్యా ఇలా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇదే విధంగా రష్యా ఆక్రమిత క్రిమియాలో ఇరాన్ జాతీయులు..కామికేజ్ డ్రోన్లను నిర్వహించేందుకు సహాయపడుతున్నారని అమెరికా, ఉక్రెయిన్ ఆరోపిస్తున్నాయి. రష్యాకు సహాయం చేయడానికి ఇరాన్ తన సిబ్బందిని పంపిందని ఆరోపణలు గుప్పించాయి.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. వరసగా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన నగరాలను ధ్వంసం చేస్తోంది. ముఖ్యంగా విద్యుత్ గ్రిడ్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇరాన్ నుంచి తీసుకున్న ‘‘ కామికేజ్’’ డ్రోన్లతో విద్యుత్ గ్రిడ్స్, మౌళిక సదుపాయాలపై దాడులు చేస్తోంది. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని కేర్చ్ బ్రిడ్జ్ ను కూల్చేసిన తర్వాత ఉక్రెయిన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది రష్యా. రానున్న శీతాకాలం దృష్ట్యా రష్యా వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది.
Russia-Ukraine War: రష్యాలో ఉగ్రవాద దాడి జరిగింది. సైనిక శిక్షణా మైదానంలో ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించగా.. 15 మంది గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన శనివారం రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగింది.
Putin reacts to PM Modi's ‘peaceful dialogue’ appeal in Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు కూడా యుద్ధాన్ని విడనాడి శాంతియుత చర్చలకు వెళ్లాలని భారత ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. అయితే ఈ నరేంద్రమోదీ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ తో శాంతియుత చర్చలకు భారత్, చైనాలు మద్దతు ఇచ్చాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం అన్నారు. గత నెలలో ఉజ్బెకిస్తాన్ సమర్కండ్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ…
Ukraine joining NATO will lead to World War III, warns Putin's Russia: ఉక్రెయిన్ అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేర్చుకుంటే.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని రష్యా వార్నింగ్ ఇచ్చింది. రష్యా భద్రతా మండలిలోని ఓ అధికారి గురువారం ఈ వ్యాఖ్యలను చేశారు. గత నెల సెప్టెంబర్ 30న రష్యా ఉక్రెయిన్ లోని 18 శాతం భూభాగాన్ని రష్యా తన దేశంలో కలుపుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు భాగాలైన ఖేర్సన్, జపొరిజ్జియా, లూహాన్స్క్,…
Joe Biden: ఉక్రెయిన్ విషయంలో పుతిన్ పొరపాటు పడ్డారని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ పై దండయాత్ర చేసే ముందు.. ప్రస్తుత ఉద్రికత్తలను తగ్గిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
Russia-Ukraine War: ఏడు నెలలు గుడుస్తున్నా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఏ మార్పు రావడం లేదు. ఇరు దేశాలు కూడా తమ ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉన్నాయి. రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతూనే ఉంది. దక్షిణ ఉక్రెయిన్ పారిశ్రామిక నగరం జపొరిజ్జియా ప్రాంతంపై రష్యా మరోసారి దాడి చేసింది. ఏడు మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో పాటు 17 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు శనివారం తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఈ మిస్సైల్స్…
Pope Francis Comments on Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాన్ని ముగించాలని..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలకు విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఇంకెంత రక్తపాతం జరగాలని ప్రశ్నించారు. శాంతి కోసం ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు. తన సొంత ప్రజల కోసం, ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను చూసి చింతిస్తున్నాని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి…