Joe Biden: ఉక్రెయిన్ విషయంలో పుతిన్ పొరపాటు పడ్డారని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ పై దండయాత్ర చేసే ముందు.. ప్రస్తుత ఉద్రికత్తలను తగ్గిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ చేతులు చాచి రష్యాను ఆహ్వానిస్తుందని పుతిన్ భావించారని తాను అనుకుంటున్నానని… ఇదే ఆయన చేసిన పొరపాటు అని అన్నారు. యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తోందని… ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ఆయన అంచనాలు తప్పడంతో అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పుతిన్ అద్భుతంగా నటిస్తున్నారని చెప్పారు.
పుతిన్ తో సమావేశం కావాలనే ఆలోచన తనకు లేదని బైడెన్ అన్నారు. ఒక వేళ జీ20 సమావేశాల్లో తనతో పుతిన్ మాట్లాడితే… తాను ఉక్రెయిన్ అంశంపై చర్చించబోనని… బాస్కెట్ బాల్ ప్లేయర్ బ్రిట్నీ గ్రైనర్ ను విడుదల చేయాలని మాత్రమే అడుగుతానని తెలిపారు. మాదకద్రవ్యాలను రష్యాలోకి స్మగ్లింగ్ చేస్తోందనే ఆరోపణలతో ఆమెను రష్యా అరెస్ట్ చేసింది. ఆమెకు తొమ్మిదేళ్ల జైలు శిక్షను విధించారు.
Read Also: YoungMan Suicide: బుల్లెట్ బండి, స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని సూసైడ్
ఉక్రెయిన్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాకు గట్టి బుద్ధి చెప్పేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది.. ఇప్పటికే యుద్ధంలో ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచిన అమెరికా.. ఆయుధాలను కూడా సమకూర్చుతోంది.. పెంటగాన్ నుంచి ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌కు 800 మిలియన్ డాలర్ల రక్షణ అందించింది.. ఇందులో కొన్ని మానవ రహిత తీర రక్షణ పడవలు కూడా ఉన్నాయి.. ఈ పడవల ద్వారానే కెర్చి వంతెన కూల్చివేసినట్లుగా రష్యా అనుమానిస్తోంది.
Read Also: Fire : కార్లలో మంటలు.. కలవరపడిన ప్రయాణికులు
తాజాగా ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సరఫరా చేయాలని నిర్ణయించింది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హామీ ఇచ్చారు. రష్యా క్షిపణులతో కీవ్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో బైడెన్, జెలెన్ స్కీ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను జోబైడెన్ ఖండించారు. రష్యావి మతిలేని చర్యలంటూ విరుచుకుపడ్డారు.. ఉక్రెయిన్ ఆత్మరక్షణకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉక్రెయిన్‌కు అందనున్నాయి. ఈ విషయాన్ని అమెరికా వైట్ హౌస్ ప్రకటించింది. రష్యాకు తగిన బుద్ధి చెప్పేలా మిత్ర దేశాలతో కలిసి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కూడా జెలెన్‌స్కీకి వివరించారు జోబైడెన్. అయితే, ఇప్పుడు అమెరికా ఎలాంటి రక్షణ సాయం అందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.