Blast: పంజాబ్ రాష్ట్రంలో పేలుడు కలకలం రేపుతుంది. అమృత్‌సర్‌లోని పోలీస్‌స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ( డిసెంబర్17) తెల్లవారుజామున 3 గంటలకు పోలీస్‌స్టేషన్ సమీపంలో పేలుడు సంభవించినట్లు చెప్పుకొచ్చారు. కానీ, స్టేషన్‌లో ఎలాంటి పేలుడు జరగలేదని.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read Also: PDS Ration Scam: మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు!
మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జర్మనీకి చెందిన గ్యాంగ్‌స్టర్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు 10 మంది అనుమానితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈనెల 4వ తేదీన అమృత్‌సర్‌లోని మజితా పోలీస్‌స్టేషన్ వద్ద కూడా పేలుడు శబ్దం వచ్చింది. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్‌లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది ఆరోసారి.