Serial killer: “లిఫ్ట్ ఇచ్చి హత్య”..11 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అరెస్ట్..
- 18 నెలల వ్యవధిలో 11 హత్యలు..
- బాధితులంతా మగవాళ్లే.. లిఫ్ట్ ఇచ్చి హత్య..
- పంజాబ్ సీరియల్ కిల్లర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial killer: పంజాబ్‌లో గత 18 నెలల వ్యవధిలో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత వారిని దోచుకుని హత్యలకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం రూపనగర్ జిల్లాలో పట్టుకున్నారు. నిందితుడిని హోషియార్‌పూర్ జిల్లాలో గర్‌శంకర్‌లోని చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులందరూ పురుషులే అని, వారితో కిల్లర్ లైంగిక చర్యలకు పాల్పడినట్లు చెప్పారు. ప్రధానంగా వారికి లిఫ్ట్ ఇచ్చిన తర్వాత, నిందితుడు ఆ వ్యక్తుల్ని దోచుకునే వాడు. డబ్బులు ఇవ్వడానికి బాధితులు నిరాకరించిన పక్షంలో వారిని చంపేవాడు. చాలా కేసుల్లో నిందితుడు, బాధితుల గొంతుకు వస్త్రాన్ని బిగించి చంపారు. కొన్ని కేసుల్లో తలకు గాయాలై చనిపోయారని అధికారులు తెలిపారు.
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
Read Also: Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)
ఒక హత్యలో నిందితుడు చంపేసిన వ్యక్తి వీపుపై ‘ధోకేబాజ్’ (మోసగాడు) అని రాశాడు. హత్యకు గురైన వ్యక్తి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మాజీ సైనికుడు. ఆగస్టు 18న టోల్‌ప్లాజా మెడ్రా వద్ద టీ, నీళ్లు అందించే 37 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో సరూప్ మరో 10 మందిని హత్య చేసినట్ల వెల్లడైంది. ఇప్పటి వరకు 5 కేసుల్ని నిర్ధారించగా, మిగిలిన హత్యల కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు రూపనగర్, హోషియార్‌పూర్, ఫతేగర్ జిల్లాల ప్రజల్ని హత్య చేశాడు. కూలీ పనులు చేసుకునే కిల్లర్ డ్రగ్స్‌కి బానిసైనట్లు అధికారులు తెలిపారు. చంపిన తర్వాత పశ్చాత్తాపంతో మరణించిన వ్యక్తుల పాదాలకు నమస్కరించి, క్షమించమని కోరే వాడని, మద్యం మత్తులో ఉన్న తర్వాతే నేరాలకు పాల్పడుతున్నాడని నిందితుడు వెల్లడించాడు. నిందితుడికి పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారని, స్వలింగ సంపర్కం కారణంగా రెండేళ్ల క్రితం అతడి కుటుంబ సభ్యులు అతడిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!