ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో ఇండియా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనను కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు 40 సంవత్సరాల తరువాత భారత హాకీ టీమ్ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించింది. జర్మనీని ఓడించి కాంస్యపతకాన్ని సొంతం చేసుకుంది. 40 ఏళ్ల తరువాత హాకీ టీమ్ జట్టు పతకం సాధించడంతో దేశంలోని ప్రభుత్వాలు వారిని ఘనంగా సన్మానిస్తున్నాయి. అయితే, పంజాబ్ ప్రభుత్వం ఒ అడుగు ముందుకువేసి వారి ఘనత చిరస్తాయిగా నిలిచిపోయేందుకు వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. పతకం సాధించిన హాకీటీమ్‌లో ఎక్కువమంది ఆటగాళ్లు పంజాబ్ చెందిన వారు ఉండటంతో వారికి సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ స్కూళ్లకు ఆటగాళ్ల పేర్లను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మిథాపూర్ జలంధర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును ఖరారు చేయగా, అమృత్‌సర్‌లోని తిమ్మోవల్ పాఠశాల పేరును వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరును ఖరారు చేశారు. అట్టారి పాఠశాల పేరును ఒలింపియన్ శంషర్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌గా, ఫరీద్‌కోట్‌లోని బాలికల పాఠశాల పేరును ఒలింపియన్ రూపిందర్‌పాల్ సింగ్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా, ఖుస్రోర్‌పూర్ పాఠశాల పేరును ఒలింపియన్ హార్దిక్ సింగ్ పాఠశాలగా, గురుదాస్‌పూర్‌లోని చాహల్ కలాన్ పాఠశాల పేరును ఒలింపియన్ సిమ్‌రంజిత్ సింగ్ ప్రభుత్వ పాఠశాలగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వ స్కూళ్లు ఉన్నంతకాలం హాకీ ఆటగాళ్ల పేర్లు ఉంటాయి.
Read: ఆ సముద్రం ఒడ్డున వేలాది సాండ్ డాలర్లు… ఎలా వచ్చాయంటే…