ఇప్పటికే ఢిల్లీలో విజయవంతమైన ఉచిత విద్యుత్ హీమీని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నది ఆప్. ఇందులో భాగంగా ఆప్ ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ఈ హామీని ఇచ్చింది. త్వరలోనే ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే తప్పకుండా ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని ఆప్ పేర్కొన్నది. ఆప్ హమీపై పంజాబ్ యువతి వెరైటీగా స్పందించింది. తనకు ఉచిత విద్యుత్ అవసరం లేదని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా కావాలని ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా అంతే వెరైటీగా సమాధానం ఇచ్చారు. తాను ఆప్ మ్యానిఫెస్టోలో లేనని, ఆప్‌కు ఓటేస్తే ఉచిత విద్యుత్ అందిస్తామని, ఈ అవకాశాన్ని పంజాబ్ ప్రజలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.