ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు నిత్యం ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంతో గడిపేందుకు కూడా వారికి సమయం దొరకదు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ పాలన విషయంలో నిత్యం బిజీగా ఉండే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ బుధవారం రోజుజ గరిటె పట్టాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా రకరకాల వంటలు చేశారు. మటన్ మసాలా, చికెన్, ఆలూ కుర్మా, బిర్యానీ వంటి పలు రకాల పసైందైన వంటలు చేశారు. అలా తయారు చేసిన వంటలను ముఖ్యమైన అతిథులకు స్వయంగా వడ్డించారు. ఇంతకీ ఆ ముఖ్యమైన అతిథులు ఎవరూ అంటే, ఇటీవలే ముగిసిన ఒలింపిక్స్‌లో పాల్గోన్న క్రీడాకారులు. జావెలింగ్ త్రో విభాగంలో రికార్డులు సృష్టించి స్వర్ణపతకం గెలుచుకున్న నీరజ్ చోప్రాతో పాటుగా, పంజాబ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి విందును ఏర్పాటు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన పురుషుల, మహిళల హాకీ క్రీడాకారులు, ఇతర అథ్లెట్స్ ఈ విందులో పాల్గొన్నారు. దేశానికి కీర్తి తీసుకురావడం కోసం క్రీడాకారులు ఎంతగానో శ్రమిస్తారు. వారి ముందు నేను చేసింది చాలా తక్కువే అని సీఎం అమరిందర్ సింగ్ పేర్కొన్నారు.
Read: గుంటూరు జిల్లాలో దారుణం: భర్తను బెదిరించి మహిళపై అత్యాచారం…