తనపై వచ్చిన ఆరోపణలపై రీకాల్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఏవైనా ప్రశ్నలుంటే యూపీఎస్‌కు సమాధానం ఇస్తానని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతానని ఆమె వ్యాఖ్యానించారు.
రీకాల్డ్ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ తల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పొలంలో ఓ రైతును తుపాకీతో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై చర్యలకు ఉపక్రమించారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం మరో యాక్షన్‌కు పూనుకుంది. బుల్డోజర్ చర్య చేపట్టింది. పూణెలోని ఆమె నివాసంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి చెట్లు, మొక్కలు పెంచారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆరోపణలు రావడంతో ఆమె శిక్షణ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయినా కూడా ఆమెకు సంబంధించిన వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఆమె పోలీసులకు.. పూణె కలెక్టర్‌పై ఫిర్యాదు చేసింది. పూణె కలెక్టర్ సుహాస్ దివాసే తనను వేధిస్తున్నాడని పూజా కంప్లంట్ చేసింది.
ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమె శిక్షణ నిలిపివేస్తూ తాజాగా ఆదేశాలు వెళ్లాయి. అకాడమీకి రీకాల్ చేశారు. దీంతో పూజాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంటికి సోమవారం అర్ధరాత్రి పోలీసులు వచ్చారు. సివిల్ డ్రస్‌లో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. గత కొద్ది రోజులుగా పూజా ఖేద్కర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఇప్పటికే ఆమె సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు నకిలీ అని వార్తలు వినిపిస్తుండగా.. కొత్తగా మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆమె చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా నకిలీవిగా అధికారులు గుర్తించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆమె వ్యవహారం ఓ వైపు రచ్చ రచ్చ చేస్తుంటే.. ఇంకోవైపు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ పూజా.. డ్యూటీలో చేరకముందే.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
Puja Khedkar : ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి తుపాకీతో రైతును బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఆమెపై రైతు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. సోమవారం పూణె రూరల్ పోలీసులు వచ్చి ఆమెను విచారించగా, ఆమె ఇంట్లో కనిపించలేదు.