Puja Khedkar: ప్రభుత్వం సీరియస్ యాక్షన్.. పూజా అక్రమ కట్టడాలు కూల్చివేత
- మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్
- ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ అక్రమ కట్టడాలు కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం మరో యాక్షన్‌కు పూనుకుంది. బుల్డోజర్ చర్య చేపట్టింది. పూణెలోని ఆమె నివాసంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి చెట్లు, మొక్కలు పెంచారు. దీంతో పూణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగి వాటిని బుల్డోజర్స్ కూల్చివేశారు. మున్సిపల్ అధికారులు ముందుగా.. పూజాకు నోటీసులు జారీ చేశారు. కానీ దానికి ఎలాంటి జవాబు ఇవ్వలేదు. దీంతో అధికారులు ఆక్రమణలను కూల్చివేశారు.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆరోపణలు రావడంతో ఆమె శిక్షణ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయినా కూడా ఆమెకు సంబంధించిన వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
తాజాగా దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం ఆమె ఒక ఫ్యాక్టరీ అడ్రస్ పేర్కొంది. యూపీఎస్‌సీ పరీక్షల్లో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ ఆస్పత్రి 2018, 2021లో జారీ చేసి ఆయా వికలాంగ పత్రాలను సమర్పించింది. అటు తర్వాత 2022లో కూడా ఔధ్ ఆస్పత్రిలో వైకల్య ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకుంది. కాకపోతే ఈ ఆస్పత్రి తిరస్కరించింది. అనంతరం ఆమెకు 2022, ఆగస్టు 24న యశ్వంత్ రావ్ మెమోరియల్ ఆస్పత్రిలో వైకల్య ధ్రువీకరణ పత్రం లభించింది. అందులో ఆమె చించ్వాడ్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీ చిరునామా ఇచ్చింది. కానీ ఆమె సమర్పించిన అడ్రస్‌లో మాత్రం ఓ ఇంజినీరింగ్ కంపెనీ ఉంది. ఇక ఆమె ఉపయోగించిన ఆడీ కారు కూడా ఇదే కంపెనీ పేరుతో రిజిస్టరై ఉంది. ఆ కంపెనీ స్థానిక పురపాలక సంఘానికి రూ.2.7 లక్షల పన్నులు బకాయి పడినట్లు రికార్డుల్లో ఉంది.
ఇదిలా ఉంటే వికలాంగ ధ్రువీకరణ కోసం ఆధార్‌కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ ఆమె మాత్రం రేషన్ కార్డే సమర్పించింది. తీరా చూస్తే.. ఆ రేషన్ కార్డు కూడా నకిలీదిగా తేలింది. తప్పుడు చిరునామాతో ఆ రేషన్ కార్డు పొందినట్లుగా అధికారులు తాజాగా గుర్తించారు.
ఇక విచిత్రమేంంటే ఆమెది లోకోమార్ వైకల్యంగా ధ్రువీకరణలో వైద్యులు పేర్కొన్నారు. మోకాలికి సంబంధించిన పాత గాయం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడు శాతం వైకల్యం ఉన్నట్లు తేల్చారు. యూపీఎస్సీలో రిజర్వేషన్ పొందాలంటే కచ్చితంగా 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉండకూడదు అనే నిబంధన ఉంది. కానీ పూజా ఆ కేటగిరిలోనే ఎలా ఉద్యోగం సంపాదించింది అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
చదువు, క్యాస్ట్, వికలాంగ సర్టిఫికెట్లు ఇలా అన్ని కూడా నకిలీవిగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన వివాదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఆమెను విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు సాధారణ పరిపాలన విభాగం ఇప్పటికే ప్రకటించింది.
చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో పూజా ఖేద్కర్ కూడా ఎదురుదాడి మొదలు పెట్టింది. పూణె కలెక్టర్ వేధిస్తున్నారంటూ మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాషిమ్ పోలీస్ స్టేషన్‌లో కలెక్టర్ సుహాస్ దివాసేపై పోలీసులకు పూజా ఫిర్యాదు చేసింది. మరోవైపు కేంద్రం ఏకసభ్య కమిటీ వేసింది. మరికొద్ది రోజుల్లో నివేదిక అందజేయనున్నారు.
#WATCH | Maharashtra: Action being taken against illegal encroachment at IAS trainee Pooja Khedkar's Pune residence. pic.twitter.com/xvBQhxxtIO
— ANI (@ANI) July 17, 2024
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?