Puja Khedkar : ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి తుపాకీతో రైతును బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఆమెపై రైతు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. సోమవారం పూణె రూరల్ పోలీసులు వచ్చి ఆమెను విచారించగా, ఆమె ఇంట్లో కనిపించలేదు. ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ..‘మేము ఆమెను తీసుకెళ్లడానికి వచ్చామని, అయితే ఆమె పరారీలో ఉంది. మేము ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించాము, కానీ ఆమె రెండు నంబర్లు స్విచ్ ఆఫ్ చేశారు. మేము ఆమె ఇంట్లో కూడా వెతికాము, కానీ అక్కడ ఆమె కనిపించలేదు’ అన్నారు.
Read Also:Gun Fire : తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. వేర్వేరు ఘటనల్లో ఒక చిన్నారి సహా ఏడుగురు మృతి
ఎస్పీ దేశ్‌ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. పూజా తల్లి మనోరమ ఖేద్కర్ ఆచూకీ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. స్థానిక శాఖ, స్థానిక పోలీసులు కూడా పూణే, దాని పరిసర ప్రాంతాల్లో వారి కోసం వెతుకుతున్నారు. వారి ఫామ్‌హౌస్‌లు, ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఆమె దొరికిన వెంటనే తనను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మనోరమ, దిలీప్ ఖేద్కర్ సహా ఏడుగురిపై రైతు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మనోరమకు మద్దతుగా మరికొందరు నిలబడి ఉండగా ఆమె రైతును తుపాకీతో బెదిరించారు. ఇటీవల వైరల్ అవుతున్న ఈ వీడియో 2023లో రికార్డయినదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పూణె జిల్లాలోని ముల్సి తాలూకాలో చోటుచేసుకుంది. ఆ తర్వాత పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read Also:Danger Stunt At Mumbai: ముంబైలో యువకుడి ప్రమాదకర విన్యాసాలు.. ఆగ్రహించిన నెటిజన్స్..
వీడియోలో మనోరమ చేతిలో కనిపిస్తున్న తుపాకీ ఆత్మరక్షణ కోసమేనని ఖేద్కర్ కుటుంబం తరపు న్యాయవాది తెలిపారు. అక్కడ వివాదం ముదిరే అవకాశం ఉండడంతో మనోరమ ఆత్మరక్షణ కోసం తుపాకీ పట్టుకుంది. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.