ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంటికి సోమవారం అర్ధరాత్రి పోలీసులు వచ్చారు. సివిల్ డ్రస్‌లో ఉన్న ముగ్గురు మహిళా పోలీసులు ప్రత్యక్షమయ్యారు. గత కొద్ది రోజులుగా పూజా ఖేద్కర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రైనీగా డ్యూటీలో చేరకముందే కలెక్టరేట్‌లో సౌకర్యాలు కోరడం తీవ్ర వివాదాస్పదమైంది. ట్రైనీ సమయంలో ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ ఆమె మాత్రం అత్యుత్సాహనికి పోయి గొంతెమ్మ కోర్కెలు కోరి కష్టాలు కొని తెచ్చుకుంది. ఈ యవ్వారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవ్వడం.. వెంటనే వాషిమ్‌కు బదిలీ అయింది. కానీ ఈ పంచాయితీ ఇంతటితో ఆగలేదు. ఆమె అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. యూపీఎస్సీలో ఆమె నకిలీ సర్టిపికెట్లు సమర్పించడం.. అలాగే విద్యకు సంబంధించిన పత్రాలు కూడా నకిలీ సమర్పించినట్లుగా కీలక అంశాలు బయటకు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Farmers March: ఢిల్లీ మార్చ్‌కి సిద్ధమవుతున్న రైతులు..
తాజాగా ఇప్పుడు మరో విషయం బయటికొచ్చింది. సివిల్స్ పరీక్షకు ఆమె వేర్వేరు పేర్లతో హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2019లో ఖేద్కర్ పూజా దిలీప్‌రావు అనే పేరుతో ప్రిలిమ్స్ రాయగా.. 2022లో పూజా మనోరమా దిలీప్ ఖేద్కర్ పేరుతో పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. రెండోసారి రాసిన పరీక్షలోనే ఆమె ఐఏఎస్‌కు ఎంపికైంది. అటు సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్‌కు చేసుకున్న దరఖాస్తుల్లోనూ తన వయసును వేర్వేరుగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే ఆమె నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్లు కాలేజీ యాజమాన్యం తేల్చింది. ఇప్పటికే పూజా ఖేద్కర్ వివాదంపై దర్యాప్తునకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండు వారాల్లో కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి: Team India: శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్లో కెప్టెన్ అతనే..!
ఇక సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు దాదాపు రెండు గంటల పాటు వారు ఆమెతో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటలకు ముగ్గురు మహిళా పోలీసుల బృందం పూణెలోని పూజా ఖేద్కర్ నివాసానికి వెళ్లారు. దాదాపు రెండు గంటల తర్వాత అంటే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మహిళా పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులతో పూజా ఏం మాట్లాడారన్నది ఇంకా తెలియలేదు. ఇక ఈ వివాదంపై పూజా తొలిసారిగా సోమవారం స్పందించారు. నేరం రుజువయ్యే వరకు అందరూ నిర్దోషులేనని, మీడియా ట్రయల్‌లో తనను దోషిగా చూపించడం సరికాదని పేర్కొన్నారు.
#WATCH | Maharashtra | After meeting trainee IAS Puja Khedkar, Washim women's police team leaves from her residence.
Puja Khedkar had called the police to share some information after getting permission from Washim collector, Buveneswari S. pic.twitter.com/N7GNVqHtia
— ANI (@ANI) July 15, 2024