వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తాను 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాశానని.. అయితే వాటిలో కేవలం ఐదింటిని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆమె కోరారు. ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదించడానికి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో యూపీఎస్సీ ఆమెపై చర్యలు తీసుకుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చేస్తున్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ స్పందించారు. ఢిల్లీ హైకోర్టులో ఖేద్కర్ తన సమాధానాన్ని దాఖలు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని అనర్హులుగా ప్రకటించే అధికారం యూపీఎస్సీకి లేదని ఆమె పేర్కొన్నారు.
Puja Khedkar: మహారాష్ట్ర కేడర్ నుంచి తొలగించబడిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే విధించింది. ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని., ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఖేద్కర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. UPSC…
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (34)కు యూపీఎస్సీ భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ జాడ గత ఐదు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లోనూ లేదు.. ఫోన్లు కూడా పని చేయడం లేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ చేసిన చట్టవ్యతిరేక పనులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కదిలించింది.
Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ట్రైనీగా ఉన్న సమయంలోనే ప్రత్యేకాధికారాలు కోరడంతో ఈమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ప్రత్యేక సడలింపు కోసం తప్పుడు మార్గాలకు పాల్పడినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.