రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళనకు దిగింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్ కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. ఎస్ఐ శివకుమార్ పై గతంలో సీపీకి, డీసీపీ కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తన దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి.. మా పిటిషన్ ను పరిశీలించకుండానే మాపై తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించేందుకు ఎస్ఐ ట్రై చేస్తున్నారని మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు అని మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఐ శివకుమార్ చేసిన అవినీతి, తీసుకున్న లంచాలపై తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అధికారులు సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. తన భర్త చేయ్యని తప్పుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ఈ కేసులో ఇరికించాలని ఎస్ఐ శివకుమార్ చూస్తున్నాడని ఆమె ఆరోపణలు గుప్పించింది.