కరెంటు కోతలపై రాజస్థాన్‌లోని బూండీ జిల్లాలో సోమవారం తీవ్ర దుమారం చెలరేగింది. కరెంటు కోతలు, ట్రాన్స్‌ఫార్మర్లను మార్చడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు, రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
తోవాయి గ్రామంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై.. గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి.
రైతుల మీద జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు.. 2023 డిసెంబర్ వరకే మీకు అధికారాన్ని ప్రజలు అప్పగించారు.. నీకేం 40 ఏళ్లకు ఇవ్వలేదు.. నువ్వేం నిజాం సర్కార్ వు కాదు అని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడుపుతావు..
పుంగనూరు ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిడ్డి రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తేజస్వినీ అనే 17 సంవత్సరాల యువతి తాను పనిచేస్తున్న హాస్పటల్లో ఉరి పెట్టుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తేజస్విని మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందినది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. వరద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ఆర్టీసీని పరిరక్షించాలని ఈనెల 26 నుండి 30 వరకు సేవ్ ఆర్టీసీ పేరుతో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
కాబూల్లో ఆఫ్ఘన్ మహిళల ఆందోళనకు దిగారు. బ్యూటీ పార్లర్లను మూసివేయాలని తాలిబాన్ అధికారులు చేసిన ఆదేశానికి వ్యతిరేకంగా బుధవారం కాబూల్లో నిరసన వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో బయటకు వచ్చిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ వాహనాలను అడ్డుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగారు.