Karnataka: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేయనున్నారు. కేంద్రం పన్నులను బదిలీ చేయడం లేదని.. రాష్ట్రానికి ఆర్థిక సహాయం కూడా చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ ప్రదర్శనకు చలో ఢిల్లీ అని పేరు పెట్టారు. కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు కూడా నిధుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.
Read Also: Minister Buggana Rajendranath: బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్ద పీట
అయితే, కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం కారణంగా కర్ణాటకకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ నేడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కలిసి నిరసన తెలుపుతామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అంతే కాకుండా కర్ణాటకకు తగిన నిధులు కేంద్ర సర్కార్ అందించకపోవడం వంటి అనేక సమస్యలపై కర్ణాటక ప్రభుత్వం నిరసన తెలియజేస్తుంది.
Read Also: SIP : నెలకు వచ్చే రూ. 20 వేల జీతంతో.. మీకు ఇలా రూ.కోటి పదవీ విరమణ నిధిని ఇలా సృష్టించొచ్చు
15వ ఆర్థిక సంఘం అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్ను వాటాలో కర్ణాటక వాటా 4.17శాతం నుంచి 3.64 శాతానికి తగ్గిందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రానికి 62,098 కోట్ల రూపాయల పన్ను నష్టం వాటిల్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అన్యాయానికి వ్యతిరేకంగా చలో ఢిల్లీ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కర్ణాటకకు పన్ను వాటా, నిధుల పంపిణీలో వివక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేయబోతున్నామని వెల్లడించారు. ఈ ఉద్యమం బీజేపీకి వ్యతిరేకంగా కాదు.. కర్ణాటక ప్రజల సంక్షేమం కోసం ప్రారంభించామన్నారు.