Moinabad Drug Case : రంగంలోకి సిట్.. నిందితుడు నమిత్ శర్మ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు
- నమిత్ శర్మ అక్రమాలపై సంచలన వివరాలు
- రాజకీయ పరిచయాలతో మోసాలకు పాల్పడ్డ నిందితుడు
- కస్టడీకి తీసుకుని లోతైన విచారణకు సిద్ధమైన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో విచారణను మరింత వేగవంతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు వెనుక ఉన్న మూలాలను, అంతరాష్ట్ర నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్‌ను నియమించగా, ఈ బృందంలో గ్రేహౌండ్స్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఈగిల్ ఫోర్స్ అధికారులు సి. హరీష్ చంద్ర రెడ్డి, ఎన్. బుచ్చయ్యలతో పాటు మొయినాబాద్ ఎస్‌హెచ్‌ఓ మల్లికార్జున రెడ్డి, ఎస్సైలు కోటేశ్వరరావు , సదాత్ అలీ సభ్యులుగా ఉన్నారు. ఉన్నత స్థాయి అధికారులతో కూడిన ఈ బృందం డ్రగ్స్ కోణంతో పాటు నిందితుల ఆర్థిక మూలాలపై కూడా దృష్టి సారించనుంది.
Also Read
ముఖ్యంగా ఈ కేసులో అరెస్ట్ అయిన నమిత్ శర్మకు సంబంధించిన విస్తుపోయే నిజాలు పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి. ఇతను కేవలం డ్రగ్స్ వ్యవహారాల్లోనే కాకుండా, రాజకీయ అండదండలు ఉన్నాయని నమ్మించి మోసాలకు పాల్పడే ఒక ఆరితేరిన చీటర్‌గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ వంటి ముఖ్య నగరాల్లోని కొంతమంది ప్రజాప్రతినిధులు , వ్యాపారవేత్తలతో పరిచయాలు పెంచుకొని, తద్వారా భారీగా అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయి. ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికి, కింది స్థాయి నాయకుల నుండి పనులు చేయిస్తానంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తానే ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పరిచయం చేసుకొని కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున సొమ్ము కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది.
Se*xual Harassment : రక్షకుడే భక్షకుడైతే..?.. బాధితురాలి మైనర్ కుమార్తె కన్నేసిన ఇన్‌స్పెక్టర్
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నమిత్ శర్మను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సాగించిన ఇతర అక్రమాలు ఏంటి అనే విషయాలపై సిట్ అధికారులు లోతుగా విచారించనున్నారు. సిట్ రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..