ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావొస్తున్న నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోని గ్రామ లేదా వార్డు సచివాలయాలను స్థానిక అధికారులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్లి, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. నెలలో 10 సచివాలయాలను సందర్శించేలా ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారు. Nara Lokesh: జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో..…
శ్రీలంకలో పరిస్థితులు విషమిస్తున్నాయి. ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే కూడా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆందోళన బాట పట్టారు. నిరసనకారులు రాజధాని కొలంబోలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని మహిందా రాజపక్సే అధికారిక నివాసాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న ప్రధానిగా మహిందా రాజపక్సే రాజీనామా చేసిన…
ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. గ్యాస్, పెట్రోల్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితులు మధ్య ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి తమ ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏకంగా అధ్యక్షుడు రాజపక్సే నివాసానికి దగ్గర్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారు శ్రీలంక ప్రజలు. తాజాగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని…
శ్రీలంకలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్ మరింత పెరుగుతోంది. ఎమర్జెన్సీ కారణంగా మరింతగా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ధరలపై పెరుగుతున్న ఆందోళనలను అణచివేయడం కోసం దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎమర్జెన్సీ శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వచ్చిందని ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు మరోసారి ఎమర్జెన్సీని ప్రకటించామన్నారు. గోటబయ రాజీనామా చేయాలని డిమాండ్లు…
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకను నిరసనలు చుట్టుముడుతున్నాయి. శ్రీలంక ప్రజలు తీవ్ర అసహనంతో వున్నారు. తీవ్ర ఘర్షణలకు దారితీశాయి పెట్రోలు, డీజల్ ధరల పెంపు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న రైల్వే ట్రాక్ పట్టాలు తొలగించారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న పోలీసు స్టేషన్ పై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళన కారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు వర్షం కురిపించారు పోలీసులు. ఈ నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా, అనేకమంది గాయాల…
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాలుగు కాళ్ల మండపం వద్ద టీడీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. లాంతర్లు నెత్తిపై పెట్టుకుని విసనకర్రలతో విసురుకుంటూ బల్బులను మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. చేతగాని సీఎం డౌన్ డౌన్ అంటూ…
కేంద్రం ఒకే దేశం ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బియ్యపు రాసులతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ధర్నా నిర్వహిస్తాం. దేశంలోనే అధికంగా పంటలు పండిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్ కో నీతి హర్యానా కో నీతి తెలంగాణకు ఒక నీతా అని ఆయన మండిపడ్డారు. పంటలను నిల్వ చేసే…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీనేతలు మండిపడుతూనే వున్నారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు చేశారు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోకపోవడంతో ధర్నా, ఆందోళనలకు దిగింది. ఇవాళ పోలీస్ కమిషనరేట్ల ముందు, ఎస్పీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు చేయనుంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయనందుకు నిరసనగా పోలీస్ కమీషనరేట్స్…
ఆదిలాబాద్ జిల్లా గూడెం వాసులు గుక్కెడు నీటికోసం తిప్పలు పడుతున్నారు..రోడ్డు సౌకర్యం లేక అల్లాడిపోతున్నారు..ఏళ్లు గడిచినా ఎవ్వరు పట్టించుకోకపోవడంతో గోస పడుతున్నారు ..చివరికి జిల్లా కలెక్టరేట్ కు మొరపెట్టుకోవడం కోసం గూడెం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు..అయినా స్పందించకపోవడం మూడు రోజులుగా కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు.. ఇదిగో ఇది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కుండిషేక్ గూడెం ఇది.. గూడెం వాసులకు తాగునీటికోసం తంటాలుపడాల్సిన పరిస్థితి..ఊర్లో బోరు లేదు..పొలాల్లో ఉండే అల్లంతదూరంలోని బావి…
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి పోరాటానికి దిగనున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని అన్నా హజారే తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఫిబ్రవరి 14 నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం సూపర్ మార్కెట్లలో, జనరల్ స్టోర్లలో మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read Also: Petrol Prices: సామాన్యులకు…