విజయవాడలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. స్విగ్గీ సంస్థ పని గంటలు పెంచడంతో పాటు ఇన్సెంటివ్స్ తగ్గించడంతో డెలివరీ బాయ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం ఇన్సెంటివ్స్ తగ్గించిన నేపథ్యంలో తమకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పెంచకుండా తగ్గించటం పట్ల స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా కష్టపడినా తమకు రూ.270 మాత్రమే వస్తున్నాయని.. పెట్రోల్ ఇన్సెంటివ్ కూడా తొలగించారని డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు.
Read Also:
Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!
తాము కస్టమర్లకు ఆహారం డెలివరీ ఇవ్వడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లినా అదే ఇన్సెంటివ్స్ ఇస్తున్నారని డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తమ కుటుంబ పోషణ కష్టం అవుతుందని ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం వేళ తాము భోజనం చేయడానికి కూడా ఖాళీ ఇవ్వకుండా స్విగ్గీ యాజమాన్యం తమకు డ్యూటీలు వేస్తున్నారని డెలివరీ బాయ్స్ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం పాత ఇన్సెంటివ్ విధానాన్నే తమకు కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా స్విగ్గీ సంస్థ ఇటీవల డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లే తమ సంస్థకు వెన్నెముక అని గొప్పలు చెప్పుకుంది. చాలామంది పార్ట్ టైమ్ జాబ్‌గా స్విగ్గీలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ తెలిపింది. ఇప్పుడేమో ఇన్సెంటివ్‌లు తగ్గించి డెలివరీ బాయ్స్ నుంచి విమర్శల పాలవుతోంది.