విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కలవారితో ఆడపిల్లలకు రక్షణ అనుమానంగా మారిపోయింది.. ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఎక్క ఏ కామాంధుడు ఉన్నాడో తెలియని పరిస్థితి.. తీరా చదువుకునే ప్రాంతంలోనూ వేధింపులు తప్పడంలేదు.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌లో కీచకపర్వం వెలుగుచూసింది. బయోటెక్నాలజీ లెక్చరర్ తమిళమణి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని… విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజీ అడ్మినిస్ట్రేషన్ భవనం దగ్గర ధర్నా చేశారు. లెక్చరర్‌ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో క్యాంపస్‌లో కాసేపు…
రోడ్ల దుస్థితిపై వినూత్న తరహాలో నిరసనకు దిగారు నిత్యానంద అనే సామాజిక కార్యకర్త.. ఉడిపిలో రోడ్లపై ఉన్న గుంతలను నిరసిస్తూ కర్ణాటకకు చెందిన నిత్యానంద ఒలకడు అనే సామాజిక కార్యకర్త పొర్లు దండాలు పెట్టారు
నిన్న శాసన సభలో కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ తో VRA లు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి వీఆర్‌ఏలు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాల్లో pay స్కెల్ ప్రకారం జీతం ఇస్తాం అని చెప్పిన కేసీఆర్ మాట తప్పారంటూ ఆరోపించారు. Pay స్కెల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం సరిపోవడం లేదని నిరసన వ్యక్తం చేసారు. కేవలం 12 వేల లోపే ప్రస్తుతం జీతం వస్తూడడంతో VRA…
చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల…
అధిక ఫీజుల వసూలు చేస్తూ విద్యార్థులను దోచుకుంటున్న పైవేట్ స్కూళ్ల దోపిడి నియంత్రించాలని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్ కు ఏబీవీపీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. పీజుల దోపిడితో పాటు ప్రభుత్వ స్కూళ్లలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలుహైదరాబాద్ డీఈవో ఆఫీసు ముట్టడి యత్నించారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరనం నెలకొది. నిరసన కారులను పోలీసులు అదుపులో తీసుకుని…
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) విద్యార్థుల ఆందోళన ఏడవ రోజుకు చేరింది. మెయిన్ గేటు వద్ద విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కాగా.. ఆరో రోజైన ఆదివారం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద 24 గంటలపాటు రాత్రీపగలూ బైఠాయింపు చేపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ రాత్రి 11 గంటల తర్వాత క్యాంపస్‌కు వచ్చారు. కొత్త డైరెక్టర్ సతీశ్‌కుమార్‌తో కలిసి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల…
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక‍్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన రాకేశ్ మృతిచెందాడు. వరంగల్ ఎంజీఎం నుంచి స్వగ్రామానికి శనివారం ఉదయం రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుపై…
తాము ఏమైనా ఉగ్రవాదులమా.. కాల్పులు జరపడానికి అంటూ ఆందోళనకారులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతారా అని మండిపడ్డారు. తమపై కాల్పులు జరపాలని ఎవరు ఆర్డర్ ఇచ్చారని ఆందోళనకారులు ప్రశ్నించారు. తమ నిరసనల్లో ఎలాంటి రాజకీయాలు లేవని, తమ న్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. ‘నాలుగు సంవత్సరాలుగా దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఆందోళనల్లో రెండు బోగీలు తగలబడ్డాయంటున్నారు. మూడు…