శ్రీలంకలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్ మరింత పెరుగుతోంది. ఎమర్జెన్సీ కారణంగా మరింతగా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ధరలపై పెరుగుతున్న ఆందోళనలను అణచివేయడం కోసం దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరోసారి ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎమర్జెన్సీ శుక్రవారం రాత్రి నుంచే అమలులోకి వచ్చిందని ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు మరోసారి ఎమర్జెన్సీని ప్రకటించామన్నారు.
గోటబయ రాజీనామా చేయాలని డిమాండ్లు మరింతగా పెరుగుతున్నాయి. జనం రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన స్టూడెంట్లపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ లను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ ఆందోళనలను అణచివేసేందుకు ఐదు వారాల్లోనే రెండోసారి ఎమర్జెన్సీ విధిస్తూ భద్రతా బలగాలకు గోటబయ అధికారాలను కల్పించారు. గోటబాయ ఇంటికి వెళ్ళాలంటూ పార్లమెంటు ముందు అండర్ వేర్లతో నిరసనకారులు ఆందోళన చేపట్టారు.. Go To Home Gota నినాదాలతో పార్లమెంటు ప్రాంగణం హోరెత్తింది.
Sri Lanka Crisis: శ్రీలంకలోని తమిళులకు స్టాలిన్ సర్కార్ భారీ సాయం