పార్లమెంట్ సమావేశాల్లో పోరుబాట పట్టిన టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి? విపక్ష పార్టీలతో కలిసి ధర్నాలలో పాల్గొనడం దేనికి సంకేతం? జాతీయ రాజకీయాల్లో ఎటువైపు అడుగులు వేయబోతోంది? పార్లమెంట్ లోపల.. బయట కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న గులాబీ పార్టీ.. ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తుందా? జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పోషించే పాత్రేంటి? తెలంగాణలో ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నది అధికార టీఆర్‌ఎస్ ఆరోపణ. రైతులకు మేలు కలిగేలా కేంద్రం సానుకూల ప్రకటన…
ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. పెండింగ్ డీఏ బకాయిలు, పీఆర్సీతో పాటు పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి ఉద్యోగ సంఘాలు. ఇవి నెరవేర్చే వరకు పోరాటానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. వచ్చే నెల నుంచి వివిధ రూపాల్లో నిరసన గళం విప్పనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన సీఎస్ కు నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్ 7 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో బ్లాక్ బ్యాడ్జీలతో…
సమాజంలో లింగ భేదాన్ని నిర్ములించడానికే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఆడ, మగా ఇద్దరు సమానమేనని అందరు అంటూ ఉంటారు కానీ చేతల్లో మాత్రం చూపించరు. అమ్మాయి జీన్స్ వేసుకుంటే తప్పు లేదు.. కానీ అబ్బాయి మాత్రం స్కర్ట్ వేసుకుంటే మాత్రం అందరు వింతగా చూస్తారు.. ఎగతాళి చేస్తారు. లింగ బేధం లేనప్పుడు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకొంటే ఏంటి..? అనే ప్రశ్న ఆ స్కూల్ విద్యార్థులకు వచ్చింది. ఆ ప్రశ్నే ఒక పోరాటానికే నాంది పలికింది. ఒక…
పశ్చిమగోదావరి జిల్లాలో వెలసిన చిన్నతిరుపతిలో ఇద్దరు మహిళల నిరసన చర్చనీయాంశం అయింది. ద్వారకాతిరుమల ఈవోని కలవడానికి వచ్చిన ఇద్దరు మహిళలు ఆలయ విఐపి లాంజ్ ముందు నిరసన తెలిపారు. వీఐపీ లాంజ్ తలుపులు వేసుకొని లోపల ఉన్నారు ఆలయ ఈవో సుబ్బారెడ్డి. అయితే, ఈవోని కలిసేవరకు వెళ్ళమని బైఠాయించిన మహిళలు నినాదాలు చేశారు. వీఐపీ లాంజ్ వద్దకు చేరుకున్న పోలీసులు, టెంపుల్ సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేశారు.
నీతోనే ప్రేమ.. నీవే నా సర్వస్వం అంటూ తిరిగాడు. చివరాఖరికి పెళ్లి మాటెత్తితే ముఖం చాటేశాడు. ఓ ప్రేమికుడి మోసానికి బలయిన యువతి అతని ఇంటిముందే నిరసనకు దిగింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామంలో ప్రియుడి ఇంటిముందు బైఠాయించింది ఆ యువతి. యువతితో నిశ్చితార్థం చేసుకొని మరో యువతిని ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు. న్యాయం చేయాలంటూ యవకుడి ఇంటిముందు నిరసన తెలుపుతోంది యువతి. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకొని…
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలకు సిద్దమవుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించేందుకు ఇల్లందుకుంట మండలం సిరిసేడుకు చేరుకున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. ఈ ఘటనలోనే ఓ టీఆర్‌ఎస్ కార్యకర్తల ఎస్సై కాలర్ పట్టుకున్నాడు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. అనుమతి తీసుకొనే ప్రచారం…
కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రోడ్లను దిగ్బంధం చేశారు. ఢిల్లీ పొలిమేరల్లో వేలాది మంది రైతులు టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకొని నిరసనలు చేస్తున్నారు. అటు హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేసేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…
ఏపీ ఎస్.ఎస్.సీ బోర్డులో అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి సెక్సువల్ గా వేధిస్తున్నారు అంటూ ఆందోళనకు దిగారు మహిళ ఉద్యోగులు. గట్టిగా మాట్లాడితే సస్పెండ్స్ చేస్తున్నారంటూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన ఓ సూపరిండెంట్ పై చేయి చేసుకుని, సస్పెండ్ చేసారు సుబ్బారెడ్డి. ఎస్.ఎస్.సీ బోర్డ్ పరువు కాపాడాలి… మహిళలను రక్షించాలి అంటూ నిరసన చేస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో మహిళ సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారని.. అలాగే అబ్బాయిలు వుండే…
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలమే రేపింది.. వారం రోజుల పాటు ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి.. అయితే, నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్యకు పాల్పడడంతో.. అంతా సద్దుమణిగింది.. అయితే, సింగరేణి కాలనీలో స్థానికులపై కేసు నమోదు చేశారు సైదాబాద్ పోలీసులు.. ఈ నెల 10వ తేదీన పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా చేసిన పలువురిపై కేసులు నమోదైంది… చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయంలో పోలీసులను అడ్డుకున్నారు స్థానికులు.. ఆ రోజు…
వినాయక చవితి ఆంక్షలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు ఆ జిల్లాలో బీజేపీకి కలిసి వస్తాయా? హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చాక కూడా పార్టీ శ్రేణులు ఎందుకు గొడవలు చేస్తున్నాయి? వినాయక చవితిని అడ్డంపెట్టుకుని గ్రామస్థాయిలో స్థానం కోసం కాషాయ దళం ప్రయత్నిస్తోందా? చవితి ఆంక్షలతో జిల్లాలో బీజేపీ బలపడే వ్యూహం! వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు ప్రకటించినప్పటి నుంచి దూకుడు పెంచింది బీజేపీ. కర్నూలుజిల్లాలో బీజేపీ ఆందోళనలకు దిగింది. అదే సమయంలో బీజేపీ రాయలసీమస్థాయి సమావేశం…