కేంద్రం ఒకే దేశం ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బియ్యపు రాసులతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ధర్నా నిర్వహిస్తాం. దేశంలోనే అధికంగా పంటలు పండిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్ కో నీతి హర్యానా కో నీతి తెలంగాణకు ఒక నీతా అని ఆయన మండిపడ్డారు. పంటలను నిల్వ చేసే సామర్థ్యం నిల్వ చేసే రసాయన విధానం కేంద్రం వాటా ఉంటుంది ..కాబట్టి మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఆరు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతాం. రైతుబంధు పొందిన ప్రతి ఇంటి పైన కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా నల్లజెండాలు ఎగరేస్తాం అన్నారు ఇంద్రకరణ్ రెడ్డి.
రైతులకు నల్ల జెండాలను ప్రభుత్వమే సమకూరుస్తుంది. ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో ముప్పై శాసనసభ స్థానాల్లో ఇరవై తొమ్మిది గెలుస్తుందని రిపోర్టు వచ్చింది. నిర్మల్ లో సైతం పీకే బృందం సర్వే నిర్వహించిందన్నారు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి.