దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. మొన్నబీహార్ లో మొదలైన ఆందోళనలు నెమ్మదిగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు రోడ్డెక్కారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను టార్గెట్ చేస్తూ విధ్వంసం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 200పైగా ట్రైన్స్ పై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు రైళ్లకు మంటపెట్టారు. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లు మహ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై దేశం ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా బీజేపీ తీరును పలు రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి. ఇదిలా ఉంటే ఖతార్, యూఏఈ, లెబనాన్, సౌదీ, ఇరాక్, మలేషియా వంటి పలు ముస్లిం దేశాలు మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలపై భారత్…
ఇటీవల తెలంగాణలో జరుతున్న వరస అత్యాచారాలు, అఘాయిత్యాలపై మహిళా కాంగ్రెస్ నేతలు మౌనదీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటే అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ అత్యాచార ఘనటలో బాధితురాలని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలని పోలీసులు హౌజ్ అరెస్ట్…
మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు ఎన్నో ఐటీ కంపెనీలు నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని, మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి…
పొలిటికల్ డ్రామా మధ్య పాకిస్థాన్ ప్రధాని పదవి కోల్పోయారు ఇమ్రాన్ ఖాన్.. అయితే, అవిశ్వాత తీర్మానం తర్వాత అధికారాన్ని కోల్పోయిన ఇమ్రాన్.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.. దీనిపై ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ర్యాలీకి భారీ సంఖ‍్యలో తరలివచ్చారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు.. ఈ సందర్భంగా పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.. ఆందోళనకారులను చెదరగట్టేందుకు పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, కొందరిని చెదరగొట్టారు.…
వేలాదిమందికి ఉపాధి కలిగించింది. లక్షలాదిమందికి అన్నం పెట్టింది. ఎంతో చరిత్ర కలిగిన ఆదిలాబాద్ సీసీఐ కథ చివరి దశకు చేరింది. సిమెంట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ మినహా అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు సిద్ధమౌతున్నారు. సిమెంట్ పరిశ్రమను పున:ప్రారంభించాలంటూ…
అనంతపురం జిల్లాలో తాడిపత్రి రాజకీయం హాట్ హాట్ గా వుంటుంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారం మామూలుగా వుండదు. తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్ మొదలైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు ప్రభాకర్‌రెడ్డి. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దీక్షకు దిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అనంతపురం రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ ముందు జేసీ దీక్షకు దిగారు.…
శ్రీలంకలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో గత కొన్ని నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గురువారం శ్రీలంకలో మరోసారి టెన్షన్ నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థి సంఘాలు రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. గోటబయ వెంటనే రాజీనామా…
విజయవాడలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. స్విగ్గీ సంస్థ పని గంటలు పెంచడంతో పాటు ఇన్సెంటివ్స్ తగ్గించడంతో డెలివరీ బాయ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం ఇన్సెంటివ్స్ తగ్గించిన నేపథ్యంలో తమకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పెంచకుండా తగ్గించటం పట్ల స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా కష్టపడినా తమకు రూ.270 మాత్రమే వస్తున్నాయని.. పెట్రోల్ ఇన్సెంటివ్ కూడా తొలగించారని డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. Read Also: Illegal Affairs: ఏపీలో మగాళ్లు…
జమ్మూ కాశ్మీర్ లో గురువారం ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వం ఉద్యోగి అయిన కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను కార్యాలయంలోనే హత్య చేశారు. బుద్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ ను దగ్గర నుంచి షూట్ చేశారు. ఉగ్రవాదాలు రాహుల్ భట్ ఎవరని ఆరా తీస్తూ… కాల్పులు జరిపారు. తాజాగా శుక్రవారం రాహుల్ భట్ అంత్యక్రియలు జరిగాయి. కాశ్మీర్ లోని పండిట్లు పెద్ద…