రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం వాయిదా పడింది. సోనియాగాంధీ (Soniya Gandhi) రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా వాయిదా పడింది.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ (Soniya Gandhi) రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ (Rajasthan) నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆమె జైపూర్‌లో నామినేషన్ దాఖలు చేశారు.
చండీగఢ్ ఉదంతంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ రిట్నరింగ్ అధికారిని ఉద్దేశిస్తూ ధర్మాసనం సంచలన వ్యా్ఖ్యలు చేసింది.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. సోమవారమే ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్దా పదవీకాలం త్వరలోనే ముగుస్తుంది. ఈ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్…
ఈడీ కేసులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పెద్ద చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు ప్రస్తావించబడింది. ఛార్జిషీట్లో గతంలో రాబర్ట్ వాద్రా పేరును ప్రస్తావించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాలకు ఇంఛార్జులను కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ ఇంఛార్జ్‌గా ఉన్న ప్రియాంకాగాంధీన వాద్రాను ఆ స్థానం నుంచి తప్పించారు. ఆమె స్థానంలో యూపీ ఇంఛార్జ్‌గా అవినాష్ పాండేని నియమించింది.
PM Modi: లోక్‌సభ ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి, ప్రధాని మోడీని గద్దె దించాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే భారీ ప్లాన్‌తో కూటమి కార్యచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీనే టార్గెట్‌గా వారణాసిలో ఆయనను ఓడించేందుకు రాజకీయ ప్రముఖుల్ని బరిలో దించేందుకు కూటమి భావిస్తు్న్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Telangana Congress: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.