Congress: కాంగ్రెస్ పార్టీ వరస వైఫల్యాలపై ఆవేదన చెందిన ఒడిశాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్‌కు చాలా సంస్కరణలు అవసమని ఆయన చెప్పారు. బారాబతి-కటక్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్విమ్ డిసెంబర్ 8న సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ పంపారు. లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటములు, 2024 నుంచి బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఒడిశా పరాజయాలను ఆయన ప్రస్తావించారు. Read Also: Tej…
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో, బీజేపీ ఆయన లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ‘‘పర్యాటన నాయకుడు’’అని అభివర్ణించింది. దీంతో కాంగ్రెస్ కూడా ప్రధాని మోడీ విదేశీ పర్యటల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది.
రూపాయి మారకం విలువ ప్రస్తుతం క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించి 90 మార్కు దాటింది. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంట్ హాల్లోకి వెళ్తున్న వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీని ఇదే విషయంపై మీడియా ప్రశ్నించింది.
Modi vs Priyanka: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు (డిసెంబర్ 1న) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార -విపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది.
ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
Bihar Elections 2025: బీహార్ సమరానికి అన్ని పార్టీలు సై అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరం సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువ అయ్యి, అనేక హామీలను గుప్పిస్తున్నారు. నామినేషన్ దాఖలు గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో వరుస ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నాయి. ఇదే సమయంతో మొదటి దశకు ఎన్నికలకు పోటీ పడుతున్న మహా కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం…
ఆప్ఘనిస్థాన్ బృందం భారత్‌లో పర్యటిస్తోంది. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. అనంతరం ఢిల్లీలోని ఆప్ఘనిస్థాన్ రాయబార కార్యాలయంలో ఆ దేశ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సమయంలో ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న (ఆగస్టు 4న) మందలించింది. రాహుల్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని, అతడు మాట్లాడిన మాటలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.