Mallu Ravi: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు.. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అవాకులు, చెవాకులు మాట్లాడారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ఆయన మాట్లాడ్డం కల్లుండి చూడలేని కబోదిలా.. చెవులుండి వినలేని చెవిటివాడిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండోరోజే ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేసి మరో రెండు రేపు చేవెళ్లలో అమలు చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోట్లాది మంది మహిళలు బస్ లల్లో ఉచిత ప్రయాణాలు చేస్తూ వారి అవసరాలు చేస్కోవడంతోపాటు డబ్బులు పొదుపు చేసుకుంటున్నారని అన్నారు.
Read also: Drugs Case: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టివేత..
5 లక్షల ఆరోగ్య శ్రీ భీమా 10 లక్షల రూపాయలకు పెంచాము. రోగులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం బాగు చేసుకుంటున్నారని తెలిపారు. రేపు 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్స్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయబోతున్నామన్నారు. రేవంత్ రెడ్డిని ముందుగా సీఎంగా ప్రకటిస్తే 30 సీట్లు రాకపోయేవని కేటీఆర్ అనడం ఆయన దూరంహకారానికి పరాకాష్ట అన్నారు. ముందుగానే రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ప్రకటిస్తే బీఆర్ఎస్ కు 3 సీట్లు కూడా రాకపోయేవని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా పని చేస్తుంది. ఎన్నికల తర్వాత గెలిచిన వారితో సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని అన్నారు. మాది కుటుంబ పార్టీ కాదు ప్రజాస్వామ్య విలువలు నిండుగా ఉన్న పార్టీ అన్నారు. కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు.
Telanagan: అమెరికాలో విషాదం.. బ్రెయిన్ స్ట్రోక్‌తో తెలంగాణ యువకుడు మృతి