కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) శనివారం రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రలో (Bharath Jodo Yatra) పాల్గొననున్నారు. యూపీలోని మొరాదాబాద్‌లో ప్రియాంక చేరనున్నారు.
ఈనెల 16న రాహుల్ భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. వారణాసి నుంచి యాత్రను రాహుల్ ప్రారంభించారు. అయితే అదే రోజు ప్రియాంక అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. డీహైడ్రేషన్, కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారు. దీంతో ఆమె శనివారం జరగనున్న రాహుల్ యాత్రలో ప్రియాంక పాల్గొననున్నారు.
ఇదిలా ఉంటే యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ సీట్లు పంచాయితీ సమసిపోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు కూడా ఈనెల 25న రాహుల్ యాత్రలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి ఐక్యంగా ఉందని సందేశాన్ని పంపనున్నట్లు సమాచారం.