Priyanka Gandhi: ప్రియాంకాగాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ప్రియాంకాగాంధీ ‘ఎక్స్’ ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు.
ఈరోజు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొనేందుకు ప్రియాంక సిద్ధమయ్యారు. కానీ అనారోగ్యం కారణంగా సోదరుడి యాత్రలో పాల్గొనలేకపోతున్నానని.. ఆస్పత్రి నుంచి కోలుకోగానే యాత్రలో పాల్గొంటానని పేర్కొన్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఈరోజు వారణాసి మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. భాదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా ఫిబ్రవరి 19న అమేథి చేరుకుంటుంది. ఆరోజు అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలోని గౌరీగంజ్‌లో రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మరుసటి రోజు రాయ్‌బరేలీకి యాత్ర చేరుకుంటుంది. ఆ రాత్రి అక్కడే బస చేసే అవకాశం ఉంది. అక్కడ నుంచి లక్నోకు వెళ్లనుంది. వాస్తవానికి ఈనెల 26 వరకు యూపీలో యాత్ర జరగాల్సి ఉన్న కూడా అక్కడ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 21కే యాత్రను ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథీ స్థానంలో ఓడిపోయారు. ఇక సోనియాగాంధీ రాయబరేలీ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని సోనియా నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రియాంక ఆస్పత్రిలో చేరికపై పార్టీ నేతలు వాకబు చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం గురించి ముఖ్యనేతలను అడిగి తెలుసుకుంటున్నారు.
I was really looking forward to receiving the BJNY in UP today but unfortunately, have ended up admitted to hospital. I will be there as soon as I am better! Meanwhile wishing all the yatris, my colleagues in UP who have worked hard towards making arrangements for the yatra and…
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?