కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ఆయన ప్రశ్నించారు
New Governors: దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలువురి రాజీనామాలను ఆమోదించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంతో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బాయిస్, మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాను అధ్యక్షుడు ముర్ము ఆమోదించారు.
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 26 నుంచి 30 వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగనుంది.. తొలి పర్యటనలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరనున్న రాష్ట్రపతి.. ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. విమానాశ్రయంలో స్వాగతం పలకున్నారు గవర్నర్, సీఎం వైఎస్ జగన్.. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా పోరంకి మురళి రిసార్టుకు చేరుకుంటారు…
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన భారత న్యాయవ్యవస్థకు 50వ అధిపతిగా నియమితులయ్యారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సీజేఐగా నియామకమైన జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
President Draupadi Murmu pays tribute to Queen Elizabeth II: భారతప్రజల తరుపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే రాణి ఎలిజబెత్ 2కు నివాళులు అర్పించారు. ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల కోసం లండన్ వెళ్లారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉన్న రాణి భౌతికకాయానికి భారత ప్రజల తరుపున ఆమె నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఈ నెల 17 నుంచి 19 వరకు యూకేలో అధికారిక పర్యటనలో ఉన్నారు.…
శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం జన్మాష్టమి వేడుకలు ప్రారంభం కావడంతో మధురలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు.
ITBP Bus Accident in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం జరిగిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) బలగాలు ప్రయత్నిస్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే 6 మంది ఐటీబీపీ సిబ్బంది చనిపోగా.. తాజా మరో ఇద్దరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం…