New Governors: దేశంలో 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలువురి రాజీనామాలను ఆమోదించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంతో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బాయిస్, మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాను అధ్యక్షుడు ముర్ము ఆమోదించారు.
మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ గత నెలలో తాను పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు కోష్యారీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. గవర్నర్ గా ఉన్న సమయంలో కోష్యారీ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బీజేపీకి వంతపాడుతున్నారని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలు, ఎన్సీపీలు ఆరోపించాయి. ఆ తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యతో ఇటీవల మహారాష్ట్రలో తీవ్ర ఉద్రికత్త రాజేసింది.
Read Also: India vs Australia Test: “అవమానం”.. ఆసీస్ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్న మీడియా..
కొత్త గవర్నర్లు వీరే..
1) అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
2) సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
4) జార్ఖండ్ గవర్నర్‌గా CP రాధాకృష్ణన్
5) హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా
6) అస్సాం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా
7) ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ (రిటైర్డ్) ఎస్. అబ్దుల్ నజీర్
8) ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు
9) ఛత్తీస్‌గఢ్ గవర్నర్ గా ఉన్న సుశ్రీ అనుసూయా ఉక్యే, మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు
10) మణిపూర్ గవర్నర్ గా ఉన్న లా. గణేశన్, నాగాలాండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు
11) బీహార్ గవర్నర్ గా ఉన్న ఫాగు చౌహాన్, మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు
12) హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు
13) జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రమేష్ బైస్ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు
14) అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గవర్నర్ గా ఉన్న బ్రిగ్. (డా.) బీడీ మిశ్రా (రిటైర్డ్), లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.