ప్రధానమంత్రి మోదీ మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ఓపెనింగ్ చేయనున్నారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తుంది. ఎందుకంటే.. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున సెంగోల్‌ను ప్రతిష్టించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
Also Read : TS POLYCET: పాలిసెట్ ఫలితాలు విడుదల.. 86.63 శాతం సత్తా చాటిన బాలికలు
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ఆయన ప్రశ్నించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం నెహ్రూకు సెంగోల్‌ను అందించిందని.. అయితే అది వాకింగ్ స్టిక్ గా మ్యూజియంలో ఉంచబడిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం చరిత్రను బోగస్ అంటోందని షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వారి ప్రవర్తనపై ఆలోచించుకోవాలని అమిత్ షా తెలిపారు.
Also Read : Karnataka: అమ్మాయి, అబ్బాయి కలిసి తింటే అంతలా కొట్టాలా ?
ఇక, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దాదాపు 25 పార్టీలు హాజరవుతాయని అందరు భావిస్తుండగా.. 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో 18 పార్టీలు ఉండగా.. ఏడు ఎన్డీయేతర పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్, లోక్ జనశక్తి పార్టీ, వైసీపీ, బీజేడీ, టీడీపీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి. ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నట్టుగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించారు.