పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన సీఎం మమతా బెనర్జీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.
తాజా వివాదంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పందించారు. తాను క్షమాపణ చెబుతానని.. తనను ఉరితీసినా తాను సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. తాను పొరపాటుగా ఈ వ్యాఖ్యలు చేశానని.. రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు.
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హస్తినకు చేరుకున్నారు.. ఇక, రేపటి నుంచి ఆయన ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు.. మొదటగా మంగళవారం రోజు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వంగా కలిసి అభినందనలు తెలపనున్నారు.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రలతో సమావేశం కానున్నారు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ…
పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి గిరిజన నాయకురాలిగా చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం ప్రత్యేక వస్త్రధారణతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె రంగురంగుల దారాలతో నేసిన సంప్రదాయ సంతాలీ చీరను ధరించారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధాని, ఉపరాష్ట్రపతితో పాటు విదేశీ ప్రముఖులు ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కళాకారులు సైతం వినూత్నంగా నూతన రాష్ట్రపతికి అభినందనలు తెలిపారు.
గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్మును కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి చేశారు.