President Droupadi Murmu: క్వీన్ ఎలిజబెత్-2కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Draupadi Murmu pays tribute to Queen Elizabeth II: భారతప్రజల తరుపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే రాణి ఎలిజబెత్ 2కు నివాళులు అర్పించారు. ద్రౌపది ముర్ము క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియల కోసం లండన్ వెళ్లారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో ఉన్న రాణి భౌతికకాయానికి భారత ప్రజల తరుపున ఆమె నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ఈ నెల 17 నుంచి 19 వరకు యూకేలో అధికారిక పర్యటనలో ఉన్నారు. సోమవారం జరిగే క్వీన్ ఎలిజబెత్ అంతక్రియలకు ఆమె హాజరుకానున్నారు. క్వీన్ అంత్యక్రియల్లో హజరుకావడానికి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలోని లాంకాస్టర్ హౌస్‌లో క్వీన్ ఎలిజబెత్ II కోసం సంతాప పుస్తకంపై సంతకం చేశారు. సోమవారం అంత్యక్రియలకు ముందు లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ లో విదేశీ నాయకుల కోసం కింగ్ చార్లెస్ 3 ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు హాజరు అవుతారు. క్వీన్ ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న కన్నుమూశారు. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ యూకే దేశాధినేతగా, కామన్వెల్త్ దేశాల అధిపతిగా ఉన్నారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Read Also: Alluri Pre Release Event: అల్లూరి కోసం వస్తున్న పుష్పరాజ్ (లైవ్)
క్వీన్ ఎలిజబెత్ మరణంపై ప్రపంచదేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్రమోదీ రాణి మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాణి మరణంపై సెప్టెంబర్ 11న భారతదేశం అంతటా ఒక రోజు జాతీయ సంతాపదినంగా పాటించింది. రేపు జరగబోతున్న క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 500 మందికి పైగా విదేశాలకు సంబంధించిన నేతలు హాజరుకానున్నారు. యూఎస్ఏ అధినేత జో బిడెన్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాల ప్రధానులు కూడా హజరుకానున్నారు. మొత్తంగా 2000 మంది ప్రముఖులు రాణి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. రష్యా, బెలారస్, మయన్మార్, ఆప్ఘనిస్తాన్, సిరియా మినహా మిగతా దేశాలను యూకే రాణి అంత్యక్రియల కోసం ఆహ్వానించింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!