ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం అన్నారు జగన్. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది. రాజకీయాలకు తావు ఉండకూడదు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీ కూడా ఉంది. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల…
ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి. కాసేపట్లో సమ్మె విరమణ ప్రకటన చేయనుంది స్టీరింగ్ కమిటీ. ఈ మేరకు లిఖితపూర్వకంగా నోట్ రాసి ఇవ్వనున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. మీడియా సమక్షంలో స్టీరింగ్ కమిటీ సభ్యుల సంతకాలతో ప్రకటన రానుంది. సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని అంశాల పై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని పేర్కొననున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. హెచ్ ఆర్ ఏ విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అవగాహన కలిగింది. 50,000 జనాభా..…
పీఆర్సీ, ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏ వ్యవహారం ఏపీలో కాకరేపుతోంది. అయితే, మరోసారి చర్చలు కొనసాగుతున్నాయి.. దీంతో.. కార్మికుల సమ్మె డెడ్‌లైన్ కంటే ముందే.. ఈ వ్యవహారానికి పులిస్టాట్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఇక, ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, పట్టువిడుపులకు మేం కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయన్న ఆయన… కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేం…
పీఆర్సీ విషయంలో సందిగ్దత తొలగించేందుకు రెడీ అవుతున్నారు. అటు మంత్రుల కమిటీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటు స్టీరింగ్ కమిటీ కూడా పట్టువిడుపులకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించింది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయి. కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేము సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. సమ్మె నోటీసులో ఇచ్చిన అన్ని అంశాలపై ఉద్యోగులు…
పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్‌లపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వచ్చామని.. మేం పెద్ద కొర్కేలేమీ అడగలేదన్నారు పీఆర్సీ…
ఏపీలో రివర్స్ పీఆర్సీపై పోరాడుతున్న ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే పనిలో వున్నారు. అమరావతిలోని ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను వైద్యారోగ్య శాఖలో ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి నెల ఏడో తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ సమ్మెకు వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. మిగిలిన ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఓ ఎత్తైతే..…
సాధారణంగా నడక ముందుకు సాగుతుంది. కానీ ఏపీలో ఉద్యోగులు మాత్రం రివర్స్ గా నడిచి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రివర్స్ పీఆర్సీ ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో జనవరి నెలకు సంబంధించి తమకు పాత వేతనాలే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నసంగతి తెలిసిందే. పీఆర్సీ సాధన…
పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది హైకోర్టు.. ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు వనిపించారు.. ఈ పిటిషన్ డివిజన్ బెంచ్ ముందు విచారించాలని, ఇది సింగిల్ బెంచ్ కాబట్టి.. ఇక్కడ విచారించకూడదని హైకోర్టుకు తెలిపారు.. ఆయన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదుపరి చర్యలు తీసుకోవడానికి పంపాలని రిజిస్టర్‌ను ఆదేశించింది. పిటిషన్లు మళ్లీ సీజే బెంచ్‌కి బదిలీ…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వ్యవహారం ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల మధ్య ఎటూ తేలకుండా పోతోంది.. ఓవైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పడితే.. మరోవైపు.. చర్చల కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది.. అయినా, చర్చలకు ముందు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. అయితే, పీఆర్సీ సాధన సమితి తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇకపై చర్చల కోసం సంప్రదింపుల కమిటీ ఎదురుచూపులు ఉండబోవని స్పష్టం చేశారు.. ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలు ఉంటాయన్న ఆయన..…
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు, సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగానే ఉంటుంది.పీఆర్సీ అంటే వేతనాలు పెరిగాలి తగ్గకూడదని తెలియదా..?అధికారులు చదువుకున్నారో… గాడిదలు కాశారో అర్ధంకావడం లేదు. READ ALSO నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామం: తమ్మినేని సీతారాం బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోంది.మాకిచ్చే డబ్బులు కూడా మా పిల్లల తిండికే సరిపోతున్నాయి.మా…