పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు, సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగానే ఉంటుంది.పీఆర్సీ అంటే వేతనాలు పెరిగాలి తగ్గకూడదని తెలియదా..?అధికారులు చదువుకున్నారో… గాడిదలు కాశారో అర్ధంకావడం లేదు.
READ ALSO నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామం: తమ్మినేని సీతారాం
బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోంది.మాకిచ్చే డబ్బులు కూడా మా పిల్లల తిండికే సరిపోతున్నాయి.మా పిల్లలను చదివించుకోవాల్సిన అవసరం మాకు లేదా..?ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికే చాలా ఒపిక పట్టాం ఇంకా ఆగితే మాకు బడితె పూజ చేసేలా పరిస్థితి ఉందన్నారు బండి శ్రీనివాసరావు.
ఇన్నేళ్ల నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు..? ఉద్యోగుల అలవెన్సులు తగ్గించి జీతాల్లో కోత పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులు దిద్దుకోవాలన్నారు. ఇంతవరకు ఒక్కసారే మేం ఆర్థికశాఖ మంత్రి బుగ్గన మొహం చూశాం. మా కడుపు మంటను ఇప్పటికైనా మంత్రి అర్థం చేసుకోవాలి. జరుగుతోన్న యుద్దంలో ఉద్యోగులంతా ప్రత్యక్షంగా పాల్గొనాలి. సమస్యలు పరిష్కరించే బుద్ది ప్రభుత్వానికి ప్రసాదించాలని అంబేద్కర్ ని కోరాం.