పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది హైకోర్టు.. ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు వనిపించారు.. ఈ పిటిషన్ డివిజన్ బెంచ్ ముందు విచారించాలని, ఇది సింగిల్ బెంచ్ కాబట్టి.. ఇక్కడ విచారించకూడదని హైకోర్టుకు తెలిపారు.. ఆయన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదుపరి చర్యలు తీసుకోవడానికి పంపాలని రిజిస్టర్‌ను ఆదేశించింది. పిటిషన్లు మళ్లీ సీజే బెంచ్‌కి బదిలీ చేసింది హైకోర్టు.. రోస్టర్ ప్రకారం తమకు విచారించే అర్హత లేదని ఈ సందర్భంగా పేర్కొంది హైకోర్టు..
Read Also: డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ.. రాష్ట్రం నుంచి తరిమేయాలి..