ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ వ్యవహారం ప్రభుత్వం-ఉద్యోగ సంఘాల మధ్య ఎటూ తేలకుండా పోతోంది.. ఓవైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పడితే.. మరోవైపు.. చర్చల కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది.. అయినా, చర్చలకు ముందు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. అయితే, పీఆర్సీ సాధన సమితి తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇకపై చర్చల కోసం సంప్రదింపుల కమిటీ ఎదురుచూపులు ఉండబోవని స్పష్టం చేశారు.. ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలు ఉంటాయన్న ఆయన.. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.. ఉద్యోగులను చర్చలకు పిలిచినా పీఆర్సీ సాధన కమిటీ వాళ్లు చర్చలకు రాకపోవడం బాధాకరం అన్నారు.
Read Also: సోమువీర్రాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. క్షమాపణ చెప్పాలి..
ఉద్యోగులు రాజకీయ ఆలోచన చేస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. జీతాలు పడితే కదా.. పెరిగేది, తగ్గేది తెలిసేదన్న ఆయన.. ఎవరికీ కూడా రూపాయి కూడా తగ్గదని స్పష్టం చేశారు. కాగా, ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ ఇవాళ మరోసారి సమావేశానికి ఆహ్వానించింది.. అయినా వారు ముందు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల కోసమే కమిటీ వేశామని, ఉద్యోగుల్లో అపోహలు తొలగించేందకు ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆయన.. ఉద్యోగులతో చర్చలకు తాము అందుబాటులో ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.