పీఆర్సీ విషయంలో సందిగ్దత తొలగించేందుకు రెడీ అవుతున్నారు. అటు మంత్రుల కమిటీ సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇటు స్టీరింగ్ కమిటీ కూడా పట్టువిడుపులకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించింది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి.
ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయి. కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేము సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది. సమ్మె నోటీసులో ఇచ్చిన అన్ని అంశాలపై ఉద్యోగులు కోరుకున్నట్లు రికవరీ లేకపోవడం, ఐదేళ్ళ పీఆర్సీ పట్ల మేం సంతృప్తిగా ఉన్నాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే స్కేళ్ళ పై అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక కావాల్సిందే అన్నారు. మెజారిటీ ఉద్యోగులు సంతోషపడే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఆశాభావంతో ఉన్నాం అన్నారు. ఇవాళ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నాం అన్నారు వెంకట్రామిరెడ్డి.