ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి. కాసేపట్లో సమ్మె విరమణ ప్రకటన చేయనుంది స్టీరింగ్ కమిటీ. ఈ మేరకు లిఖితపూర్వకంగా నోట్ రాసి ఇవ్వనున్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులు. మీడియా సమక్షంలో స్టీరింగ్ కమిటీ సభ్యుల సంతకాలతో ప్రకటన రానుంది. సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని అంశాల పై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని పేర్కొననున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.
హెచ్ ఆర్ ఏ విషయంలో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య అవగాహన కలిగింది. 50,000 జనాభా.. వరకు10 % 11వేల సీలింగ్. 50,000 నుంచి 2,00,000..12% 13వేల సీలింగ్. 2,00,000పైబడితే 16 శాతం, 17వేల సీలింగ్. 50 లక్షల పై బడిన జనాభాకు 24 శాతం. సచివాలయ, హెచ్ఓడీ కార్యాలయాలకు 24%…జూన్ 2024 వరకు ఈ లబ్ది. దీని కోసం ప్రత్యేక జీవో విడుదల చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
అంత్యక్రియల ఖర్చు 25వేల రూపాయలు.సీసీఏను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం. మార్చి 2022 నాటికి సీపీఎస్ రద్దు కు రోడ్ మ్యాప్ సిద్ధం. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తి ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి అవుతుందన్నారు సజ్జల.
ప్రభుత్వానికి ఉద్యోగులపై ప్రేమ ఏంటో నిరూపితమైంది. ఐదు డీఏలను ఒకేసారి ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం అన్నారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి, వెంకట్రామిరెడ్డి. పీఆర్సీ జీవోల జారీ తర్వాత అన్ని అంశాలు మరుగునపడ్డాయి.ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. సమ్మెకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు.
ఫిట్మెంట్ విషయంలో 27 శాతం ఉండాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారని, ప్రతి ఉద్యమంలోనూ ఇలాంటి చిన్న చిన్నవి సహజమే అన్నారు పీఆర్సీ సాధన సమితి నేత. బండి శ్రీనివాస్. సీఎంను కలిసే సందర్భంలో వారినీ కలుపుకువి వెళ్తాం అన్నారు.