ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం షాకిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ సీఎస్ కు లేఖ రాసింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఇవాళ సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కార్ రావు. పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని పేర్కొంది ఏపీజీఈఏ. అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యనించింది.…
ఏపీలో సీపీఐ నేతలు యాక్టివ్ అవుతున్నారు. వివిధ సమస్యలకు సంబంధించి తరచూ లేఖలు రాస్తుంటారు సీపీఐ నేత రామకృష్ణ. తాజాగా సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఆయన స్పందించారు. సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్ మెంట్ సరిపోదన్నారు. వారికి కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. గ్రామ సచివాలయ…
HRA , CCA, పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాలను యధాతథంగా కొనసాగించాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. దీనిపై వారు మాట్లాడారు. ఇప్పటికే సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిసిన జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావుతో పాటు ఇతర నేతలు ఉన్నారు. తమ డిమాండ్లను సీఎస్‌కు చెప్పారు. కాగా అమరావతి ఐక్యవేదిక నుంచి నేతలు వినతిపత్రం సమర్పించారు. Read Also: రైతు కష్టం తెలిసిన సీఎం కేసీఆర్: నామా నాగేశ్వరరావు ఉద్యోగులకు…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు తెలిపింది. పెండింగ్ డీఏలు…
ఏపీలో ఉద్యోగుల రిటర్మైంట్ వయసుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించానన్నారు సీఎం జగన్. ఈ ఉదయంకూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను. నిన్న నేను 2–3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను. కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను. రాష్ట్ర…
ఏపీలో పీఆర్సీ అంశం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. పీఆర్సీ పై సీఎం జగన్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఉద్యోగులు అడుగుతున్నంత కాకపోయినా వారు ఆనందంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇప్పటికే పేర్కొన్నారు. ఉద్యోగులు సహజంగా వాళ్ళ డిమాండ్స్ చేశారని, అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సీఎం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇప్పటికే సీఎం ఉద్యోగులకు చెప్పారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం ఉత్తమమయిన మార్గం వెల్లడిస్తారన్నారు.
పీఆర్సీపై ఇవాళే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.. గురువారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సీఎం వైఎస్ జగన్… ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని.. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.. ఇదే సమయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు ఏపీ సీఎం……
ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా పీఆర్సీపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దీనిలో భాగంగా పలు మార్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేవాలు నిర్వహించారు.. తాజాగా, బుధవారం రోజు కూడా భేటీ జరిగింది.. అయితే, ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు.. ఈ సమావేశంలో పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి ఆయా…
పాత తెలుగు సినిమాల్లో శాపనార్థాలు పెట్టే సీన్ రిపీట్ అయింది. చంద్రబాబు రెండు గంటల ప్రసంగంలో శాపాలు పెట్టడమే సరిపోయింది. చంద్రబాబు స్పీచ్ తో కార్యకర్తలకు కూడా ఊపు రావటం లేదు. ముందు కుప్పంలో నాయకత్వం మార్చాలి. చంద్రబాబు విఫల నాయకుడు. టీడీపీ ఓ విఫల పార్టీ. ప్రయత్నం కూడా చేయకుండా అప్పనంగా అధికారం రావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.