పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్‌లపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వచ్చామని.. మేం పెద్ద కొర్కేలేమీ అడగలేదన్నారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాస్.. కానీ, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలో ఏం రహస్యం ఉంది.. ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.. రాష్ట్ర వ్యాప్తంగా డీడీవోలు 70 శాతం మేర బిల్లులు ప్రాసెస్ చేయలేదన్న ఆయన.. ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం బేషజాలకు పోతోంది.. జీతాలు.. పీఆర్సీ.. ప్రతి దాంట్లోనూ కన్ఫ్యూజనే ఉందని.. సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకోవాలని కోరారు.
Read Also: జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానం
ఇక, నిర్బంధ వేతన సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ… డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామంటూ మెమోలు జారీ చేయడం సరికాదన్న ఆయన.. క్రమశిక్షణను ఉల్లంఘిస్తేనే చర్యలు తీసుకోవాలి తప్ప.. కోపం వస్తే చర్యలు తీసుకోవడం కుదరదన్నారు.. మరోవైపు, ఏపీలో కొందరు ఐఏఎస్ అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు సూర్యనారాయణ.. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ.. వారిపై అవసరమైతే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.. ఎస్ఆర్ లేకుండా పే ఫిక్సేషన్ చేయలేరు.. అలాగే ఉద్యోగులు కొత్త పీఆర్సీ వద్దని రిక్వెస్ట్ లెటర్లు ఇచ్చారని గుర్తుచేశారు.. సాంకేతికంగా చూస్తే డీడీవోలు.. ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోలేరని స్పష్టం చేశారు. ఎవరి మీదన్నా చర్యలు తీసుకుంటే పీఆర్సీ సాధన సమితి అండగా ఉంటుందని ప్రట్నించిన ఆయన.. పీఆర్సీ సాధన సమితి త్వరలోనే లీగల్ సెల్ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.. కొత్త పేస్కేళ్ల ప్రకారం జీతాలు వస్తే.. పే స్లిప్పులను దహనం చేసి నిరసన తెలుపుతామని ప్రకటించారు సూర్యనారాయణ.