ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం అన్నారు జగన్. రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది.
రాజకీయాలకు తావు ఉండకూడదు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీ కూడా ఉంది. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందన్నారు. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే ఉద్యోగులది. అంత దూరం పోవాల్సిన అసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చన్నారు.
Also Read
- Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
- AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. నిన్న మంత్రుల కమిటీ నాతో టచ్‌లోనే ఉంది. నా ఆమోదంతోనే వీటన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగిందన్నారు సీఎం జగన్. ఐ.ఆర్. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400 భారం పడుతోందన్నారు జగన్.
హెచ్.ఆర్.ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్ వ్యయం రూపేణా హెచ్.ఆర్.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది. మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోంది.
ఆర్థికంగా పడే భారం ఇది. మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈవివరాలు చెబుతున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం. ఈ పరిస్థితులు ఈమాదిరిగా ఉండకపోయి ఉంటే… మీరందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు సీఎం జగన్.
రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి. మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం, అన్నిరకాలుగా ఆయా జీతాలు పెంచాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈచర్చలు జరిగాయి. మీరు లేకపోతే నేను లేను. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నా అన్నారు. ఇది మీ వల్లే సాధ్యపడుతోంది. భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండన్నారు. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండి.
రాబోయే రోజుల్లో సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నాం. అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నాం. వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటా అన్నారు జగన్. ఇవాళ మీరు కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్ మంచిగా పెరిగేలా చూస్తానన్నారు. ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు.
భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నాం అన్నారు. అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తా అన్నారు, కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తా అన్నారు. 30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం అన్నారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం. అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం అన్నారు.
ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశాం. అలాగే ఇళ్లస్థలాల విషయంలో కూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు జగన్. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం. మీరు చెప్పేవి వినడానికి ఈప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!